Black Hair And Hair Fall Home Remedies: ప్రస్తుతం చాలా మంది యువత జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడంతో పాటు తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు ఆధునిక జీవనశైలి కారణంగానే వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
జుట్టు సమస్యలతో బాధపడే చాలా మంది ఖరీదైన హెయిర్ స్పాలలో ట్రిట్‌మెంట్ పొందుతున్నారు. అయితే ఇక నుంచి ఇలాంటి చికిత్సాలు పొందన్నక్కర్లేదని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కేవలం ఈ ఇంటి చిట్కాలను ఉపయోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అగసె విత్తనాలను జుట్టుకు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఇందులో లభించే ప్రొటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి జుట్టును అందంగా చేసేందుకు సహాయపడతాయి. దీంతో పాటు జుట్టుకు పోషణను అందిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే జుట్టుకు ఈ ఫ్లాక్స్ సీడ్స్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అవిసె గింజల హెయిర్ స్పా జెల్:
అవిసె గింజలు
అలోవెరా జెల్
కొబ్బరి నూనె
ఆవనూనె
వాటర్
హెయిర్ స్పా జెల్ తయారి పద్ధతి:
అవిసె గింజలతో తయారు చేసిన హెయిర్ స్పా జెల్ జుట్టుకు ఎంతో సహాయపడుతుంది. అయితే ఈ జెల్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నీటిని బాగా మరిగించి 2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ వేసి సుమారు 10 నిమిషాల పాటు బాగా మరిగించాల్సి ఉంటుంది. అయితే నీరు మొత్తం ఆవిరైపోయి తర్వాత సీడ్స్ అన్ని జెల్‌లా తయారవుతాయి. ఆ తర్వాత జెల్‌ని గింజలను ఓ గిన్నెలో వడకట్టుకోవాలి. ఇలా వేరు చేసుకున్న తర్వాత జెల్‌ను గిన్నెలో వేసుకుని అలోవెరా జెల్, కొబ్బరి నూనె, ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అంతే సులభంగా హెయిర్ జెట్ రెడీ అయినట్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి