Ginger Tea For Bad Cholesterol: అల్లతో చేసిన ప్లెయిన్ టీతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Ginger Tea For Bad Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. ఇది ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. అయితే శరీరంతో వీటి లక్షణాలు ప్రారంభ దశలో కనిపించవు.. కానీ సమస్య పెరగడం ప్రారంభించినప్పుడు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2022, 03:45 PM IST
  • అల్లతో చేసిన ప్లెయిన్ టీతో శరీరానికి చాలా రకాల ప్రయోజనాలున్నాయి
  • శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి
  • శరీరాన్ని దృఢంగా చేస్తాయి
 Ginger Tea For Bad Cholesterol: అల్లతో చేసిన ప్లెయిన్ టీతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Ginger Tea For Bad Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. ఇది ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. అయితే శరీరంతో వీటి లక్షణాలు ప్రారంభ దశలో కనిపించవు.. కానీ సమస్య పెరగడం ప్రారంభించినప్పుడు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా రక్తనాళాల్లో కొవ్వు విపరీతంగా పెంచి.. అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయి. కావున ఈ కొలెస్ట్రాల్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడానికి మొదటగా జీవనశైలిని మార్చుకోవడం, రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ విధంగా చేస్తే సమస్య సులభంగా తొలగిపోయే అవకాశాలున్నారు. అంతేకాకుండా ఇటీవలే వెల్లడించిన నివేదికల ప్రకారం టీలో కూడా కొవ్వును నియంత్రించే అవకాశాలున్నాయట..ఒక నిర్దిష్ట రకమైన హెర్బల్ టీ తాగడం వల్ల ధమనులలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

సహజంగా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది:

ఏదైనా శారీరక సమస్యకు ఆయుర్వేద నివారణలు ఉత్తమమైనవి. భారతదేశంలో ఇటువంటి అనేక మూలికలు ఆయుర్వేద శాస్త్రంలో వివరించబడ్డాయి. వీటి సహాయంతో చెడు కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించవచ్చు.

రోజూ అల్లం టీ తాగండి:

అల్లం సాధారణంగా మసాలాగా..  ఆహారం యొక్క రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ ఇందులో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. దీనితో చేసిన టీని తాగడం వల్ల శరీరంలో  కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతుంది. అల్లం ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ హెర్బ్. ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. దీనిని తాగడం వల్ల శరీరానికి అనేక లాభాలు చేకూరుతాయి.

అల్లం టీ ఎలా తయారు చేయాలి?

# ఒక బౌల్‌లో ఒక కప్పు నీటిని వేడి చేయండి.

# దానికి చిన్న అల్లం ముక్కను చూర్ణం ఆ వేడి నీటిలో వేయండి. 

# ఇప్పుడు అది పూర్తిగా మరిగే వరకు వేచి ఉండండి.

# ఇప్పుడు ఈ అల్లం ప్లెయిన్ టీని ఫిల్టర్ చేసి తాగండి.

# రుచి చాలా చేదుగా ఉంటే, దానికి ఒక చెంచా తేనె వేసుకోండి.

# మీరు రోజుకు కనీసం 2 సార్లు త్రాగాలి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

 

Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!

Also Read: Sprouts for Diabetes: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే ఇది మీ కోసమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News