Instant Relief From Constipation: తరచుగా మలబద్ధకంతో బాధపడుతున్నారా? ప్రతి రోజు ఇవి తినండి చాలు..

Constipation Home Remedies For Adults: మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ కింది ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 25, 2023, 03:00 PM IST
Instant Relief From Constipation: తరచుగా మలబద్ధకంతో బాధపడుతున్నారా? ప్రతి రోజు ఇవి తినండి చాలు..

 

Constipation Home Remedies For Adults: మలబద్ధకం కారణంగా చాలా మంది తీవ్ర పొట్ట నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇవే కాకుండా చాలా మందిలో విపరీమైన పొట్ట సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కింది ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ కింది ఆహారాలను ప్రతి రోజు తీసుకోండి:
పచ్చి శనగలు:

ప్రతి రోజు తీసుకునే ఆహారంలో పచ్చి శనగలు తీసుకుంటే జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్‌ తీవ్ర మలబద్ధకం సమస్యను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. శనగల్లో ఫైబర్‌తోపాటు ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

గంజి:
చిరుధాన్యాలతో తయారు చేసిన గంజిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు దీనిని ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  

చియా విత్తనాలు:
చియా విత్తనాల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఈ విత్తనాలను తప్పకుండా ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 

ఓట్స్:
ఓట్స్‌లో ఫైబర్‌ పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గడమేకాకుండా తీవ్ర పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తుంది.

బొప్పాయి:
బొప్పాయి పండులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు పండును తీసుకోవడం సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News