Hair Care Tips: వివిధ రకాల పని ఒత్తిడులు, వాతావరణం వంటి కారణాలతో జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. వర్షాకాలంలో ఈ సమస్య మరింతగా ఉంటోంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఆ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అందమైన, పొడుగైన, మృదువైన కేశాలుండాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. ఎందుకంటే అందమైన కేశాలు అమ్మాయి అందాన్ని రెట్టింపు చేస్తాయి. అదే సమయంలో డ్రైగా నిర్జీవంగా, హార్డ్‌గా ఉండే కేశాలు అమ్మాయి అందానికి చేటు తెస్తాయి. కాలుష్యం వంటి కారణాలతో జుట్టు సంబంధిత సమస్యలు అధికంగా ఉంటున్నాయి. హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, నిర్జీవమైన కేశాలతో అమ్మాయిలకు చాలా ఇబ్బందిగా మారుతోంది. కేశాలు అందంగా ఉండాలంటే..ముందు అవి పటిష్టంగా ఉండాలి. కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు సంబంధిత సమస్యల్నించి దూరం కావచ్చు.
కెమికల్స్ ఉండే ఉత్పత్తులు వాడటం వల్ల కేశాలకు ప్రమాదం ఏర్పడుతుంది. కేశ సంరక్షణ కోసం ఎప్పుడూ సహజసిద్ధమైన పద్ధతుల్నే ఆశ్రయించాలి. హెర్బల్ ఉత్పత్తులు మంచి ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. మీకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటే..గోరు వెచ్చని నూనెతో హెయిర్ మసాజ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ముందుగా నూనెను కొద్దిగా వేడి చేయాలి. ఈ నూనెను తల స్కాల్ప్‌కు రాసి బాగా మాలిష్ చేయాలి. దీనివల్ల కేశమూలాలు పటిష్టమౌతాయి. కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది. ఓ గంట తరువాత మృదువైన షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
వేడి లేదా అధిక ఉష్ణోగ్రత కారణంగా జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారుతుంది. జుట్టు పటిష్టంగా ఉండాలంటే హెయిర్ స్ట్రైటెనింగ్, డ్రైయర్ వంటివాటికి దూరంగా ఉంటే మంచిది.
Also read: Camel Milk Wax: క్యామెల్ మిల్క్ వ్యాక్స్ ఎంతవరకూ పనిచేస్తుంది, నొప్పి లేకుండా రోమాలు తొలగించవచ్చా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook