Natural Hair Care Tips: నల్లగా, పొడవాటి, ఒత్తైన జుట్టు ఉంటేనే ముఖం అందంగా కనిపిస్తుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల చాలా మంది తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్యలు కొందరిలో కాలుష్యం కారణంగా కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఏయే ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే జుట్టు దృఢంగా మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఏం తినాలో తెలుసా?:
1. అవిసె గింజలు:
జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలో అవిసె గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, మాక్రోన్యూట్రియెంట్లు అధిక పరిమాణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు అవిసె గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును నల్లగా దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.
Also Read: Weight Loss Tips: బరువు తగ్గేందుకు వ్యాయామం, డైటింగ్ రెండింట్లో ఏది ముఖ్యం
2. కరివేపాకు:
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీరానికే కాకుండా జుట్టుకు కూడా చాలా సహాయపడతాయి. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల జుట్టు పొడవుగా నల్లగా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
3. ఉసిరికాయ:
ఉసిరిలో కూడా చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. వీటిని ఆహారాల్లో ప్రతి రోజు తీసుకోవడం వల్ల జుట్టు పొడవగా తయారవుతుంది. ఇందులో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉసిరితో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: 20 Days Weight Loss Tips: ఎక్కువ శ్రమ అక్కర్లేదు.. ఈ 4 పద్దతులతో 20 రోజుల్లో బరువు తగ్గొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి