Walnuts Benefits: వాల్ నట్స్‌లో ఉండే ప్రోటిన్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని బ్రెయిన్ ఫుడ్స్ అని కూడా అంటారు. ఇది చూడడానికి అచ్చం మెదడులా ఉంటాయి. కాబట్టి బ్రెయిన్ ఫుడ్స్‌గా పేరు వచ్చింది. ముఖ్యంగా ఇది మహిళలకు చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. కాబట్టి మహిళలు క్రమం తప్పకుండా వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా కూడా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వాల్ నట్స్ మహిళలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళలు వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గర్భధారణ సమయంలో:
పిండం అభివృద్ధి క్రమంలో వాల్‌నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి గర్భంతో ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది. కాబట్టి ఇది మహిళలకు అన్ని రకాలుగా మేలు చేస్తుంది.
సంతానోత్పత్తి:
వాల్ నట్స్ మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి. గర్భధారణ సమయంలో చాలా మంది వివిధ రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వాల్ నట్స్ తీసుకోవాలి. వీటి తీసుకుంటే బాడీ కూడా యాక్టివ్‌గా ఉంటుంది.
చర్మం, జుట్టు కోసం:
వాల్‌నట్స్‌లో ఉండే గుణాలు చర్మం, జుట్టుకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. అంతేకాకుండా కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
మంచి నిద్ర:
పురుషుల కంటే మహిళల్లో నిద్రలేమి సమస్యలకు అధికంగా గురవుతున్నారు. అయితే ఖాళీ కడుపుతో ఈ వాల్ నట్స్ తీసుకుంటే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాల్‌నట్‌లు శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook