Weight Loss Tips: స్థూలకాయం కూడా ప్రాణాంతకమే, రోజూ ఈ టిప్స్ పాటిస్తే చాలు బరువు తగ్గడం ఖాయం

Weight Loss Tips: మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో జీవనశైలి చాలా కీలకం. జీవనశైలి సరిగ్గా లేకపోతే స్థూలకాయం వెంటాడుతుంది. స్థూలకాయంను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకం కూడా కావచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 6, 2023, 07:12 PM IST
Weight Loss Tips: స్థూలకాయం కూడా ప్రాణాంతకమే, రోజూ ఈ టిప్స్ పాటిస్తే చాలు బరువు తగ్గడం ఖాయం

Weight Loss Tips: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా బరువు పెరగడం సాధారణంగా మారింది. స్థూలకాయం తగ్గించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమౌతుంటారు. అందుకే ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అయితే ఈ చిట్కాలు పాటిస్తే సులభంగా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నిత్య జీవితంలో అవలంభించే వివిధ రకాల పనులే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. మనిషి ఆరోగ్యం అనేది ఆ మనిషి ఫిట్నెస్‌పై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలని కోరుకుంటారు. ఇది ఆ మనిషి జీవనశైలిని బట్టి ఉంటుంది. జీవనశైలి సరిగ్గా లేకుంటే స్థూలకాయం సమస్య తలెత్తుతుంది. అందుకే రోజూ నిద్రించే ముందు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఫలితంగా వేగంగా బరువు తగ్గించుకోవచ్చు.

రాత్రి నిద్ర తప్పనిసరి

రాత్రి వేళ సరాసరి కంటే ఓ గంట ఎక్కువ సేపు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడంలో అద్భుతంగా దోహదమౌతుంది. సగం కంటే ఎక్కువ వ్యాధులు నిద్ర లేమి కారణంగానే వస్తుంటాయి. అంటే రాత్రి వేళ ఎంత ఎక్కువ నిద్ర ఉంటే అంత మంచిది. అంత వేగంగా బరువు తగ్గించుకోవచ్చు. మానసిక ప్రశాంతత కూడా దీంతోనే వస్తుంది. అందుకే రాత్రి వేళ పడుకునే వేళలు ఇవాళ్టి నుంచే మార్చుకోండి. ఎక్కువ సేపు పడుకునేలా అలవాటు చేసుకోండి.

నిద్రకు ముందు ప్రోటీన్ షేక్

రోజూ నిద్రించే ముందు ప్రోటీన్ షేక్ తాగడం అలవాటు చేసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.  కార్బోహైడ్రేట్స్ లేదా ఫ్యాట్‌తో పోలిస్తే ప్రోటీన్లు బెస్ట్ ధర్మోజెనిక్ అని చెప్పవచ్చు. ఇవి జీర్ణమయ్యేందుకు శరీరం ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది.

స్లీప్ మాస్క్

స్లీప్ మాస్క్ ధరించడానికి బరువు తగ్గడానికి సంబంధముంది. తక్కువ వెలుతురులో పడుకునేవారికి లావయ్యే అవకాశాలు 21 శాతం ఉంటాయి. అందుకే స్లీప్ మాస్క్ ధారణ చాలా మంచిది. బరువు తగ్గించేందుకు ఇది కూడా దోహదపడే అంశమే. స్థూలకాయానికి చెక్ పెట్టేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Also read: Cholesterol Problem: మీకు కొలెస్ట్రాల్ సమస్య ఉందా, తక్షణం ఈ పదార్దాలు మానేయాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News