How To Remove Pimples Naturally And Permanently: ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ మూలికల గురించి వివరించారు. ప్రకృతి లభించే ప్రతి మొక్కలో ఔషధ గుణాలు లభిస్తాయి. రసాయనాల ఔషధాలకు బదులుగా న్యాచురల్ రెమిడీస్‌ను వినియోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే చాలా మంది అన్ని సీజన్స్‌లో చర్మ సమస్యల బారిన పడతారు. ముఖ్యంగా చాలా మంది యువత ఎక్కువగా ఇబ్బంది పడుతున్న చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. నిజాని వీటిని వినియోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు తీవ్ర చర్మ సమస్యలకు కూడా దారీ తీయోచ్చు. కాబట్టి ఈ మొటిమల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద శాస్త్ర నిపుణులు సూచించిన వేప ఆకు రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల చర్మ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
మొటిమలకు వేపను ఎలా వినియోగించాలో తెలుసా?
వేప జిడ్డ చర్మం, మొటిమలతో బాధపడేవారికి ప్రభావంతంగా సహాయపడుతుంది. దీంతో పాటు ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని రక్షించేందుకు ప్రభావంగా సహాయపడుతుంది. తరచుగా మొటిమల సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా వేప, చందనం ఫేస్ ఫ్యాన్‌ను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. దీనిని ఎలా తయారు చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేప,చందనం ఫేస్ ప్యాక్:
2 టేబుల్ స్పూన్లు చందనం పొడి
1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్
తగినంత నీరు
2 టేబుల్ స్పూన్లు వేప పొడి
తయారీ విధానం:
ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పైన పేర్కొన్న అన్ని రకాల పొడులను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో తగినంత వాటర్ కలుపుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని, ఫేస్‌కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన 30 నిమిషాల తర్వాత బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
వేప, శనగ పిండి, పసుపు స్క్రబ్
½ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్
1 టేబుల్ స్పూన్ వేప పొడి
½ టేబుల్ స్పూన్ పసుపు పొడి
2 టేబుల్ స్పూన్లు గ్రాముల పిండి
తయారీ విధానం:
ముందుగా ఈ స్ర్కబ్‌ను తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో పైన పేర్కొన్న అన్ని పదార్థాలను కలుపుకుని బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కొద్దిగా పోస్తూ మిశ్రమంలా తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ను బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ముఖంపై అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచి.. చల్ల నీటితో శుభ్రం చేయాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి