Hair Fall: హెయిర్ ఫాల్..జుట్టు రాలే సమస్య ఇప్పుడు అందరికీ పెద్ద ఇబ్బందిగా మారుతోంది. వాతావరణంలో మార్పులు, దుమ్ము ధూళి, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలడం ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలి.
అందమైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, వాతావరణంలో దుమ్ము ధూళి, వివిధ రకాల నీళ్ల కారణంగా జుట్టు రాలిపోవడం ప్రధానంగా కన్పిస్తోంది. ఈ సమస్య మహిళలకే కాదు..అబ్బాయిలకు కూడా ఇదే పరిస్థితి. అంతేకాదు డాండ్రఫ్ కూడా మరో ఇబ్బందిగా మారుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా డాండ్రఫ్, జుట్టు రాలడం తరచూ కన్పిస్తున్నాయి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా..జుట్టు రాలడం, డాండ్రఫ్ అనేది పీడిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సహజ సిద్ధమైన నేచురల్ రెమిడీతో ఈ సమస్య నుంచి గెట్టెక్కవచ్చు. ఆ విధానమేంటో చూద్దాం.
వాస్తవానికి జుట్టు రాలడానికి చాలా కారణాలుంటాయి. ఆహారం, నీరు, ఒత్తిడి, వాతావరణం, వయస్సు పెరగడం, ఏదైనా అనారోగ్యం ఇలా చాలా కారణాలు ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపధ్యంలో ముందుగా మీ జీవనశైలి మార్చుకోవాలి. తినే ఆహారంపై, తాగే నీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే మీకు జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
నేచురల్ పద్ధతుల్లోనే డాండ్రఫ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. గుడ్డుతో కూడా జుట్టు రాలే సమస్య నుంచి గట్టెక్కవచ్చు. గుడ్డు వాడటం వల్ల జుట్టు సిల్కీగా, అందంగా మారతాయి. గుడ్డుతో పాటు బియర్ వాడితే డాండ్రఫ్ సమస్య పోతుంది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook