Skin Care Tips: ప్రకృతిలో విరివిగా లభించే పుచ్చకాయ గురించి అందరికీ తెలిసిందే. ఆరోగ్యపరంగా ఇది చాలా మంచిది. అయితే ముఖ సౌందర్యానికి, చర్మ పరిరక్షణకు సైతం ఇది అద్భుతంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. పుచ్చకాయ గింజలతో ముఖానికి అద్భుతమైన నిగారింపు వస్తుంది. ఎలాగో తెలుసుకుందాం..
పుచ్చకాయ అనేది వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఫ్రూట్. వేసవికాలంలో లభించే ఫ్రూట్ ఇది. వేసవిలో సాధ్యమైనంత ఎక్కువగా సేవించడం ద్వారా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఈ సీజన్‌లో విరివిగా లభించే పుచ్చకాయను ఎక్కువగా సేవిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. పుచ్చకాయ కేవలం ఆరోగ్యానికే కాకుండా చర్మానికి సైతం చాలా మంచిది. పుచ్చకాయ గింజలు ఇందుకు అద్భుతంగా దోహదపడతాయి. పుచ్చకాయ గింజలతో ఫేస్‌మాస్క్ ముఖ సౌందర్యానికి, చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. ముఖంపై పింపుల్స్, యాక్నే వంటి సమస్యలు దూరమౌతాయి. ఆయిలీ స్కిన్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. వృద్ధాప్య లక్షణాల్ని దూరం చేయడంలో పుచ్చకాయ గింజలు కీలకంగా ఉపయోగపడతాయి.
పుచ్చకాయ గింజలతో ఫేస్‌మాస్క్ తయారు చేసేందుకు 1 స్పూన్ పుచ్చకాయ గింజలు అవసరమౌతాయి. దీంతోపాటు ఒక స్పూన్ ముల్తానీ మిట్టీ, ఒక స్పూన్ పెరుగు, 4-5 డ్రాప్స్ రోజ్ వాటర్, 2-3 డ్రాప్స్ తేనె కావల్సి ఉంటాయి.
పుచ్చకాయ విత్తనాలతో ఫేస్‌మాస్క్ తయారు చేసేందుకు అన్నింటికంటే ముందుగా పుచ్చకాయ విత్తనాలు తీసుకోవాలి. ఈ విత్తనాల్ని మిక్సీలో పౌడర్‌గా చేసుకోవాలి. ఈ పౌడర్‌ను ఓ గిన్నెలో తీసుకుని..అందులో మిగిలిన పదార్ధాలు కలపాలి. మొత్తం అన్నింటినీ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. అంతే పుచ్చకాయ గింజల ఫేస్‌మాస్క్ తయారైనట్టే.
పుచ్చకాయ గింజల ఫేస్‌మాస్క్‌ను రాయడానికి ముందు ముఖం శుభ్రంగా కడగాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆ తరువాత దాదాపు 15 నిమిషాలు అలానే ఉంచి..నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మ సమస్యలు దూరమై చర్మానికి అద్భుతంగా నిగారింపు వస్తుంది.
Also read: Cancer Signs: కేన్సర్‌ను సకాలంలో ఎలా గుర్తించడం, ఎందుకు ప్రాణాంతకమౌతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook