Best Herbal Tea For Weight Loss Diabetes: దాల్చిన చెక్కను ఆహారాల రుచిని పెంచే సుగంధ ద్రవ్యంగా వినియోగిస్తారు. అయితే ఇది ఆహారాల రుచి పెంచడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దాల్చిన చెక్కలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కాల్షియం, మాంగనీస్, జింక్, కాపర్, నియాసిన్, థయామిన్ వంటి ముఖ్యమైన మూలకాలు లభిస్తాయి. కాబట్టి ఆహారాలను ప్రతి రోజూ వినియోగించడం వల్ల శరీరానికి పోషకాలు అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని టీలా తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీని ప్రతి రోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దాల్చిన చెక్క టీతో శరీరానికి కలిగే ప్రయోజనాలు:
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
ప్రస్తుతం బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కేజీ కూడా బరువు తగ్గడం లేదు. అయితే ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా కూడా బరువు తగ్గాలనుకునేవారు దాల్చిన చెక్క టీని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకువారు తప్పకుండా దాల్చిన చెక్క, బెల్లం నీటిని తాగాల్సి ఉంటుంది.
దాల్చిన చెక్క టీ తాగడం వల్ల చర్మానికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకే దాల్చిన చెక్క టీ తాగితే మొటిమలు, ఇతర చర్మ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి పొట్ట సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
పీరియడ్స్‌లో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది:
ఆడపిల్లలు పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పులు, తిమ్మిర్లు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దాల్చిన చెక్కల టీని తీసుకోవడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి సమస్యలను తగ్గిస్తుంది:
దాల్చిన చెక్క టీ తాగడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మెదడు ఒత్తిడిని తగ్గించి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:
మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ టీని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించండానికి..
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలా మంది కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా గుండె పోటు, బీపీ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ఈ టీలను తాగాల్సి ఉంటుంది.
Also Read: Investment Tips: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి
Also Read: Kane Williamson: అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.. కానీ వెంటాడిన దురదృష్టం.. సీజన్ మొత్తానికి దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి