Weight Loss Juice Diet: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవనశైలిని అనుసరించి ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఫిట్‌నెస్ కూడా కోల్పోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడం చాలా కష్టమైనప్పటికీ ఉదయం పూట జ్యూస్‌లు తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి ప్రతి రోజూ ఏ రసాలను తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలంటే ఈ జ్యూస్‌ను బ్రేక్ ఫాస్ట్‌లో తాగండి:
క్యారెట్ జ్యూస్:
క్యారెట్ జ్యూస్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. మరోవైపు, మీరు రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే, అది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
క్యాబేజీ రసం:
క్యాబేజీ రసం కూడా శరీరానికి చాలా మేలు చేస్తుంది.ఈ జ్యూస్ తాగడం వల్ల పొత్తికడుపు వాపుతో పాటు బరువు తగ్గుతుంది. క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అజీర్తి సమస్య కూడా దూరమవుతాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయి.
దుంపల రసాలు:
దుంపల రసాలు బాడీకి చాలా మేలు చేస్తాయి. వాటితో తయారు చేసిన జ్యూస్‌లు తాగడం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి అలసట కూడా దూరమవుతుంది. ముఖ్యంగా బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: ఢిల్లీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక ప్రకటన రానుందా ?
ఇది కూడా చదవండి : Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook