Weight Loss Tips: ప్రస్తుతం భారత్‌లో నలుగురిలో ముగ్గురు బరువు పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే ఆయిల్ ఫుడ్స్ తినడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధునిక జీవన శైలి కారణంగా బరువు తగ్గడం సవాలుగా మారింది. అయితే బరువును తగ్గించే క్రమంలో పలు రకాల తప్పులు చేస్తున్నారు..! అయితే ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ 5 తప్పులు బరువు పెరగడానికి దారితీస్తుంది:
బరువు తగ్గిన తర్వాత.. కొన్ని పొరపాట్లు చేస్తే.. మళ్లీ బరువు పెరగడం వంటి సమస్యలు మొదలవుతాయి..!, ఈ 5 రకాల అలవాట్లను రోజువారీ జీవనశైలిలో చేర్చుకుంటే.. బరువును మెయింటెయిన్ చేయడానికి ఎటువంటి సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
1. ఒక్కోసారి ఏదో ఒక విధంగా బరువు తగ్గితే.. వర్కవుట్ చేయడం మానేస్తారు. ఇలా చేయడం పెద్ద తప్పని నిపుణులు తెలుపుతున్నారు.
2. బరువు తగ్గడానికి పలు రకాల ఆహార నియమాలను పాటిస్తారు. బరువు తగ్గిన వీటిని విస్మరిస్తారు. ఇలా చేయండం తప్పని నిపుణులు చెబుతున్నారు.
3. బరువు తగ్గే క్రమంలో బయటి జంక్, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉంటారు. తగ్గిన తరువాత వీటిని తినడం స్టార్ట్ చేస్తారు. ఇలా చేయోదని నిపుణులు తెలుపుతున్నారు.
4. బరువు పెరగడానికి నిద్ర లేకపోవడమే పెద్ద కారణం అని ఆరోగ్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
5. నీరు తాగడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మన శరీరంలో నీటి కొరత ఏర్పడితే జీవక్రియను ప్రభావితం చేస్తుంది. కావున బరువుపై ప్రభావం చూపుతుంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి:
గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ మాట్లాడుతూ.. అధిక ప్రోటీన్ ఫైబర్ ఆహారం తీసుకుని, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా తినాలని వారు చెబుతున్నారు. వీలైనంత త్వరగా మద్యం సేవించే చెడు అలవాటును మానుకోవడం మంచిదని వైద్యుడు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:High Cholesterol Treatment: చెడు కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందడానికి రోజూ ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook