White Hair Solution: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు తెల్లబడడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ సమస్యను నివారించేందుకు అనేక సహజమైన మార్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి.
చేప నూనె
ఫిష్ ఆయిల్ ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా మంచిదే. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండడం కారణంగా.. ఇది జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. అయితే చేప నూనె క్యాప్యూల్స్ కూడా మార్కెట్లో కూడా లభిస్తున్నాయి. దీన్ని జుట్టుకు రాసి మెల్లిగా మర్దన చేయాలి. అలా మర్దన చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
ఆలివ్ నూనె - 2 టేబుల్ స్పూన్లు
చేప నూనె / క్యాప్సూల్ - 2 టేబుల్ స్పూన్లు
అలోవెరా జెల్ - 2 టేబుల్ స్పూన్లు
ఒక గిన్నెలో పైన పేర్కొన్న పదార్థాలను సమానంగా కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లే చేసే ముందు.. తలస్నానం చేసి జుట్టును ఆరబెట్టుకోవాలి. జుట్టు కుదుళ్ల నుంచి వేపనూనె రాసి మసాజ్ చేయాలి. అలా 5 నుంచి 7 నిమిషాల వరకు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. షాంపూ, కండీషనర్ తో జుట్టును బాగా శుభ్రపరుచుకోవాలి.
ఫిష్ ఆయిల్ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు..
1. జుట్టుకు ఎదుగుదల, ఆరోగ్యవంతంగా మార్చేందుకు చేప నూనె ఎంతో సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా జీవితాంతం జుట్టు తెల్లగా మారకుండా చేస్తుంది.
2. ఫిష్ ఆయిల్ లో పోషకాలు, ప్రొటీన్లతో నిండిన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల మీ జుట్టు లోపలి నుంచి మంచి ఎదుగుదల లభిస్తుంది.
3. ఈ నూనె.. జుట్టు మూలాలు, చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, పోషకాలను అందిస్తుంది. దీంతో తలకు రక్తప్రవాహం పెరగడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు ద్వారా గ్రహించింది. దీన్ని పాటించే ముందు వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.)
Also Read: Diabetes Breakfast: షుగర్ పేషెంట్స్ ఈ అల్పాహారాలను ట్రై చేయండి.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook