Business News in Telugu: ఆదిత్య బిర్లా గ్రూప్ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో బిర్లా ఓపస్ పేరుతో స్పెషల్ ఎక్స్ పో నిర్వహించింది. బిర్లా ఓపస్ 2,300+ లైట్ కలర్ ఆప్షన్స్‌తో పెయింట్‌లు, ఎనామెల్స్, వుడ్ ఫినిషింగ్‌లు, వాల్‌పేపర్‌లతో సహా 145 ప్రొడక్ట్స్‌ను, 1,200 ఎస్‌కేయూలను ప్రదర్శనలకు ఉంచింది. సోమ, మంగళవారాల్లో ఈ ఎక్స్‌పోను నిర్వహించింది. దేశవ్యాప్తంగా తమ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు 180కుపైగా ప్రాంతాలకు దీన్ని మరింత విస్తరించే ప్లాన్‌లో ఉంది. వ్యాపార భాగస్వాములు ముఖ్యంగా డీలర్లు, పెయింటర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్‌లతో సంబంధాలను పెంపొందించుకోవడం, బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఎక్స్‌పోలను నిర్వహిస్తోంది.
Also Read: Speaker Election: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ దారెటు, మద్దతు కోసం ఇండియా కూటమి
ఈ సందర్భంగా బిర్లా ఓపస్ సీఈఓ రక్షిత్ హర్‌గేవ్ మాట్లాడుతూ.. తాము 175పైగా ప్రదేశాలలో ఎక్స్‌పోస్ ద్వారా భారత్‌లోని ప్రతి ప్రాంతానికి చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వ్యాపార భాగస్వాములు అంటే డీలర్లు, పెయింటర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లను ఈ ఎక్స్‌పోలకు స్వాగతిస్తున్నామని తెలిపారు. తమ వాణిజ్య భాగస్వాములతో లోతైన దీర్ఘకాల సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఎక్స్‌పోలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. బిర్లా ఓపస్ పెయింట్స్ వినియోగదారులకు డెకరేటివ్ పెయింటింగ్ సొల్యూషన్‌లను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్, వాటర్‌ఫ్రూఫింగ్, ఎనామెల్ పెయింట్స్, వుడ్ ఫినిషింగ్‌లు, వాల్‌పేపర్ వంటి బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లను, పరిసరాలను తమకు నచ్చిన రంగుల్లో అద్భుతంగా మార్చుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.
Also Read: AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter