మూవీ రివ్యూ: ఒక పథకం ప్రకారం (Oka Pathakam Prakaaram)
నటీనటులు: సాయి రామ్ శంకర్, శృతి సోడి, ఆషిమా నర్వాల్, సముద్రఖని, తదితరులు
సంగీతం: రాహుల్ రవి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి
దర్శకత్వం: వినోద్ విజయన్
విడుదల తేది: 7-2-2025
తెలుగులో ప్రస్తుతం థ్రిల్లర్ జానర్స్ లో తెరకెక్కే చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. ఈ కోవలో సాయి రామ్ శంకర్ హీరోగా వినోద్ విజయన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. ఈ సినిమాలో విలన్ ఎవరో ఇంటర్వెల్ లో చెబితే.. పదివేలు ఇస్తానని చెప్పి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
సిద్ధార్ధ్ నీలకంఠ (సాయి రామ్ శంకర్) కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తుంటాడు. తన భార్య సీత (ఆశిమా నర్వాల్) ను తొలి చూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో అనుకోకుండా అతని భార్య కనిపించకుండా పోతుంది. దీంతో పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. భార్య దూరమైందనే బాధలో డ్రగ్స్ కు బానిసవుతాడు. ఈ క్రమంలో అతను ఉంటున్న విశాఖ పట్నంలో ఆడవాళ్ల వరుస మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మర్డర్స్ అన్ని సిద్ధార్ధ్ చేసినట్టు అతని తోటి లాయర్ చినబాబుతో పాటు ఏసీపీ (సముద్రఖని) ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ మర్డర్స్ ఇన్వేష్టిగేషన్ ఏపీసీ కవిత (శృతి సోడి)కి చేతులోకి వెళుతుంది. ఈ క్రమంలో లాయర్ భార్యను కూడా ఎవరో క్రూరంగా మర్డర్ చేస్తారు. ఇంతకీ ఈ వరుస మర్డర్స్ ఎవరు చేస్తున్నారు. అసలు సిద్ధార్ధ్ కు ఈ హత్యలకు ఏమైనా కనెక్షన్ ఉందా.. ? చివరకు నిజమైన సైకో హంతుకుడిని చట్టం పట్టుకుందా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు మర్డర్ థ్రిల్లర్ ను ఒక పాయింట్ చుట్టే తిప్పడం కాస్త విసుగు తెప్పించినా.. ఇంటర్వెల్ విలన్ ఎవరో కనిపెట్టండి. పదివేలు పట్టుకోండి అంటూ చెప్పిన పజిల్ తో చూసే ప్రేక్షకుల్లో కూడా ఒకింత క్యూరిసిటీ పెరిగింది. ముఖ్యంగా దర్శకుడు ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ తో తొలి చూపులోనే ప్రేమ.. పెళ్లి.. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడం. దీని వెనక ఎవరున్నారనే పాయింట్ చుట్టే నడిపించాడు. చూసే ప్రతి సీన్ లో హీరోతో పాటు ప్రతి ఒక్కరిపై డౌట్ క్రియేట్ అయ్యేలా దర్శకుడు స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అంతేకాదు వెబ్ సిరీస్ లో 6 భాగాలుగా సినిమాను చూపించాడు. మొత్తంగా హీరో, ఒక విలన్ ను పట్టించడం అతను హీరోపై పగ పెంచుకోవడం. దాంతో అతనికి సంబంధించిన వాళ్లను క్రూరంగా చంపడం వంటివి రొటీన్ గా ఉన్నా.. ఓవరాల్ గా థియేటర్స్ లో సినిమా చూసే ప్రేక్షకులను కొంత వరకు ఎంగేజ్ చేయగలిగాడు. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ముఖ్యంగా సాయి శంకర్ నుంచి నటన రాబట్టుకున్నాడు. ఏసీపీగా సముద్రఖని యాక్టింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. అతన్ని ఏ మేరకు యూజ్ చేసుకోవాలో ఆ మేరక వాడుకున్నాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. నిర్మాణ పరంగా పర్వాలేదు.
నటీనటుల విషయానికొస్తే..
సాయి రామ్ శంకర్ .. లాయర్ సిద్ధార్ధ నీలకంఠ పాత్రలో మంచి నటన కనబరిచాడు. అక్కడక్కడ తేలిపోయినా.. ఓవరాల్ గా పర్వాలేదనిపించాడు. ఈ సినిమాలో సముద్రఖని.. ఏసీపీ పాత్రలో కన్నింగ్ పోలీస్ అధికారిగా తన యాక్టింగ్ తో ఇరగదీసాడు. మరోవైపు శృతి సోడీ కూడా తన నటనతో పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.
బ్యాటమ్ లైన్ : ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే థ్రిల్లర్ డ్రామా..‘ఒక పథకం ప్రకారం’
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.