Sabari: 'శబరి' సినిమాలో 'అలిసిన ఊపిరి'...పాటను విడుదల చేసిన డైరెక్టర్ కరుణ కుమార్..

Sabari: దక్షిణాది చిత్ర సీమలో విభిన్న పాత్రలతో అలరిస్తోన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా ఈమె లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా 'శబరి'. అనిల్ కాట్జ్ దర్శకుడు. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైవుతున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని 'అలసిన ఊపిరి' పాటను డైరెక్టర్ కరుణా కుమార్ విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 30, 2024, 02:36 PM IST
Sabari: 'శబరి' సినిమాలో 'అలిసిన ఊపిరి'...పాటను విడుదల చేసిన డైరెక్టర్ కరుణ కుమార్..

Sabari:  వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా యేళ్ల తర్వాత లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా 'శబరి'. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల భారీ ఎత్తున నిర్మించారు.  నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్‌గా ఈ సినిమాలోని 'అలసిన ఊపిరి'.. పాటను ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈయన వరుణ్ తేజ్ హీరోగా 'మట్కా' మూవీని తెరెక్కిస్తున్నాడు. గోపీ సుందర్ మ్యూజిక్ దర్శకత్వంలో రెహమాన్ లిరిక్స్ అందించిన పాటను ప్రముఖ సింగర్‌గా అనురాగ్ కులకర్ణీ పాడారు.  

'అలిసిన ఊపిరి
కణకణ మండే ఆయుధమల్లే మారే...
తరిమిన చీకటి'
 అంటూ ఎంతో ఉద్వేగ భరితంగా ఈ పాట సాగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు తల్లి కూతుళ్ల మధ్య అనుబంధం,  ప్రేమను నేపథ్యంలో తెరకెక్కాయి. 'అలిసిన ఊపిరి' పాటలో పోరాటానికి సిద్ధమవుతున్న మెయిన్ లీడ్ వరలక్ష్మిని చూపించారు. మధ్యలో కుమార్తె కోసం అన్వేషణలో పడిన తల్లి మనసును సైతం ఈ పాటలో టచ్ చేశారు.    గోపీసుందర్ బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, రెహమాన్ సాహిత్యం దీన్ని తమ్ముడు తరహాలో మోటివేషనల్ సాంగ్ తరహాలో ఉంది.

పాట విడుదల చేసిన అనంతరం దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. రెహమాన్  అద్భుతమైన సాహిత్యం అందించారు. పాట చాలా బావుంది. విజువలైజేషన్ కూడా బాగా చేశారు. మదర్ అండ్ డాటర్ ఎమోషన్ తీసుకుని తెరకెక్కించి సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు.  

నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ... ''సాంగ్ రిలీజ్ చేసిన కరుణ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. . ఇప్పటికే 'శబరి' మూవీ నుంచి ట్రైలర్, ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినిమాకు మంచి బజ్ ఏర్పడింది.

నటీనటులు:
వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటించారు.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News