Sabari - Varalaxmi Sarathkumar: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో చంద్రబోస్ సతీమని.. సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ అందించిన పాటను చంద్రబోస్ విడుదల చేసారు. తన కెరీర్‌లో ఓ పాటను విడుదల చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ...
'శబరి' సినిమాలోని 'అనగనగా ఒక కథలా...' పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. గోపీసుందర్ సంగీతంలో ఈ పాటను రెహమాన్ రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. ఈ పాట విని సాహిత్యం చదివాను. చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. అందుకే ఈ పాటను విడుదల చేయమని అడిగానే వెంటనే పనిచేశాను.
తల్లి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించాలిని కోరుకుంటున్నాను. నిర్మాత మహేంద్రనాథ్‌తో పాటు చిత్ర బృందం అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
Oscar winner @boselyricist Released the #Sabari song #AnaganagaOkaKadhala and choreography by #SUCHITRA_CHANDRA_BOSE,
Lyrics was Given by @lyricistRahman, Sung by Singer #Chitra .https://t.co/U5d6vUvUD0#SabariOnMay3rd@varusarath5@anilkatz@MoviesByMaha@mimegopi… pic.twitter.com/hT1swAjq25— BA Raju's Team (@baraju_SuperHit) April 27, 2024
సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ... ''నేను కొరియోగ్రఫీ అందించిన పాటను మా ఆయన విడుదల చేయడం ఇదే ఫస్ట్ టైమ్. చాలా ఆనందంగా ఉంది. 'శబరి' సినిమాలో చక్కటి సందర్భంలో వచ్చే గీతమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
'అనగనగా ఒక కథలా...' పాట విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ''తల్లి ప్రేమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో మా 'శబరి' ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం అన్నారు. కన్న బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఎంత దూరం వెళుతుందనేది చెప్పే చిత్రమిది. బరువైన భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది.
'శబరి' చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి 'అనగనగా ఒక కథలా...' అంటూ రెహమాన్ సాహిత్యం అందించగా... లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర ఆలపించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాటను విడుదల చేశారు.
బిడ్డ మీద తల్లి ప్రేమ ఎప్పటికీ కరగదని చెప్పే గీతం 'అనగనగా ఒక కథలా'. తల్లికి బిడ్డే ప్రపంచం అని చెప్పే గీతమిది. చిన్నారి పిలుపునకు బదులు తల్లి, చిన్నారి అడుగులకు గొడుగు తల్లి, చిన్నారి కలలకు రంగులు తల్లి అంటూ కన్నపేగుతో అమ్మకు ఉండే బంధాన్ని రెహమాన్ అద్భుతంగా రాయగా... చిత్ర గాత్రం ఆ పాటలో భావం ప్రేక్షకులకు చేరువ అయ్యేలా అంతే గొప్పగా పాడారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి