Varalakshmi Sarathkumar as sabari: తల్లీ కూతుళ్ల అనుబంధం తెలిపే వరలక్ష్మీ శరత్ కుమార్ 'శబరి' మూవీలోని 'నా చెయ్యి పట్టుకోవే' సాంగ్..

Varalakshmi Sarathkumar: వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ల్ యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'శబరి'. ప్యాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి విడుదలైన నా చెయ్యి పట్టుకోవే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 22, 2024, 04:20 PM IST
Varalakshmi Sarathkumar as sabari: తల్లీ కూతుళ్ల అనుబంధం తెలిపే వరలక్ష్మీ శరత్ కుమార్ 'శబరి' మూవీలోని  'నా చెయ్యి పట్టుకోవే' సాంగ్..

Varalakshmi Sarathkumar:విలక్షణ నటి వరలక్ష్మి ఈ మధ్య కాలంలో తన యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. గతేడాది సంక్రాంతి సీజన్‌లో బాలయ్య వీరసింహారెడ్డిలో చెలరేగిపోయిన వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈయేడాది సంక్రాంతికి విడుదలైన 'హనుమాన్'లో హీరో అక్కగా అంజనమ్మగా ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు ఈమె యాక్ట్ చేస్తే హిట్ అనే సెంటిమెంట్ కూడా ఏర్పడింది. తాజాగా ఈమె 'శబరి' అనే ప్యాన్ ఇండియా మూవీలో టైటల్ రోల్ ప్లే చేస్తోంది. మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మే 3న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచారా చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ' నా చెయ్య పట్టుకోవే' పాటను 5 భాషల్లో  రిలీజ్ చేసారు. అన్ని భాషల్లో ఆయా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

'శబరి' మూవీకి  గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ఆయన స్వరపరిచిన బాణీకి తెలుగులో రహమాన్ సాహిత్యం అందించారు. ఈ పాటను అమృతా సురేష్ పాడారు. 'శబరి మ్యూజిక్' ఛానల్ ద్వారా సాంగ్ విడుదలైంది.

'నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా...
మబ్బుల్లో తేలిపోదా రివ్వు రివ్వునా...అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ , నివేక్షపై  ఈ పాటను పిక్చరైజ్ చేసారు. కొడైకెనాల్ కొండల్లో అందమైన లొకేషన్స్‌లలో ఈ పాట చిత్రీకరణ చేశారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ విహార యాత్రకు వెళ్లే సమయంలో పాట వస్తుందని విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది.

'నా చెయ్యి పట్టుకోవే...' సాంగ్ విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ... ''ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  వరలక్ష్మీ శరత్ కుమార్ గారి నటన చిత్రానికి మెయిన్ అట్రాక్షన్.  తల్లిగా ఆమె నటించిన తీరు, కుమార్తె కోసం పడే తపన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారు తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. తల్లీ కుమార్తె మధ్య సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. కథలో కీలకమైన సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. మే 3న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

నటీనటులు:
వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని, బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.

సాంకేతిక బృందం:
ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు - నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ - రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అనిల్ కాట్జ్.

Also Read: TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్‌.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News