చికాగోలో హైదరాబాద్ యువకుడు అక్బర్ పై కాల్పులు జరిపారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన ఆల్బరి పార్క్ వద్ద జరిగింది. పార్క్ చేసిన కారువైపు వెళుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అక్బర్ పై తుపాకితో కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యసహాయం అందిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిన అక్బర్ అక్కడి డ్రైవీ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు.
పోలీసులు హైదరాబాద్లో ఉన్న అక్బర్ తల్లితండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లితండ్రులు కుమారుడుపై చింత పెట్టుకొని తల్లడిల్లిపోతున్నారు. కుమారుడు క్షేమంగా ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రం చొరవ చూపి హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు సహకరించాలని అక్బర్ తండ్రి విజ్ఞప్తి చేశారు.