8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. వేతన పెంపు మరింత ఆలస్యం

More Time For Formation Of Pay Panel: కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో త్వరలో 8వ వేతన సంఘం అమలవుతుందని ఆశల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌ తగిలినట్టు కనిపిస్తోంది. వేతన సంఘం ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో వేతనాల పెంపు ఆలస్యమయ్యేలా ఉంది. దానికి గల కారణాలు తెలుసుకుందాం.

1 /6

8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు భారీ ఆశల్లో ఉన్నారు. అయితే వారి ఆశలు నెరవేరడానికి మరికొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. వేతన సంఘం ఏర్పాటుకు ఆలస్యమవుతుందని తెలుస్తోంది.

2 /6

8th Pay Commission: దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, 65 లక్షల మంది పెన్షనర్ల భత్యాలను సవరించడానికి 8వ వేతన సంఘం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి వేతన సంఘం ఏర్పాటుపై ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా.. ఆర్థిక, రక్షణ, హోం వ్యవహారాలు, సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖల నుంచి కేంద్ర ప్రభుత్వం సూచనలను కోరిందని తెలుస్తోంది. దీని కారణంగా వేతన సంఘం ఏర్పాటు ఆలస్యం కానున్నట్లు సమాచారం.

3 /6

8th Pay Commission: 8వ వేతన సంఘానికి సంబంధించిన ఖర్చులను 2025-26 కేంద్ర బడ్జెట్‌లో లెక్కించలేదని ఓ అధికారి వెల్లడించారు. దీని కారణంగా వాటిని లెక్కించేందుకు ఈ సమయం అవసరమని కేంద్ర ప్రభుత్వ ఉన్నత అధికారి తెలిపారు.

4 /6

8th Pay Commission: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్‌లో 8వ వేతన సంఘానికి సంబంధించిన ఎలాంటి వివరాలను ప్రస్తావించలేని విషయం తెలిసిందే. కొత్త వేతన సంఘం సిఫార్సులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే జనవరి 1, 2026 నుంచి అమలులోకి రాకపోవచ్చునని కనిపిస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పాటు ఏప్రిల్ నాటికి జరగవచ్చనే వార్తలు వస్తున్నాయి.

5 /6

8th Pay Commission: వేతన సంఘానికి సంబంధించిన ముసాయిదాను రక్షణ, హోం వ్యవహారాలతోపాటు ఇతర మంత్రిత్వ శాఖల అభిప్రాయాల కోసం పంపారు. వారి అభిప్రాయాలు, సిఫార్సులు అందిన తర్వాత కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం పంపిస్తారు. ఈ ప్రక్రియకు కొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. వేతన సంఘం ఏర్పాటు అనంతరం దాని నివేదికను సమర్పించడానికి కొంత సమయం పడుతుంది. ఆపై ప్రభుత్వం దానిని పరిశీలించాల్సి ఉంటుంది. 

6 /6

8th Pay Commission: ఈ కారణాల రీత్యా రాబోయే ఆర్థిక సంవత్సరంలో 8వ వేతన సంఘం చెల్లింపులు ఆశించలేం. 2026 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు ఉంటాయని ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది.