Akshaya Tritiya: అక్షయ తృతీయ ప్రతి యేడాది వైశాఖ శుద్ద తృతియ రోజున వస్తోంది. హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. చాలా మంది ఈ రోజున కొత్త వసస్తువులు లేదా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ వస్తోంది. అసలు ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటంటే.. ?
విష్ణువు దశావతారాల్లో ఒకటైన పరుశురాముడు ఇదే రోజున జన్మించారు.
అక్షయ తృతీయ రోజున సింహాచలంలో వరాహా నరసింహాస్వామికి చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది.
భగీరథుడి తపస్సుతో గంగానది భూమిని తాకిన పవిత్ర దినం
రాముడి అవతారం అయిన త్రేతా యుగం మొదలైన రోజు ఇదే.
వ్యాస మహర్షి వినాయకుని సహాయంతో మహాభారతం వ్రాయడం మొదలైన దినం
సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న ధర్మరాజుకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం
శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడిని కలుసుకున్న దినం
శివుడిని ప్రార్ధించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మి సహాయంతో సమస్త సంపదలకు సంరక్షకుడిగా నియమింపబడిన దినం
జగద్గురు ఆది శంకరులు కనకధార స్తవం చెప్పిన దినం
అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
పాండవుల పత్ని ద్రౌపదిని దుశ్శాసనుని బారి నుండి శ్రీకృష్ణుడు కాపాడిన దినం