Mahesh Babu: 500 రూపాయలు పెట్టి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ దొంగలించిన మహేష్ బాబు..!

Mahesh Babu - Vishnuvardhan: టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది చెన్నైలోనే చదువుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, సూర్య, విష్ణువర్ధన్ క్లాస్ మేట్స్ కాగా, మహేష్, విష్ణువర్ధన్ బెంచ్ మేట్స్ కూడా. ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన విష్ణువర్ధన్.. చిన్నతనంలో మహేష్ బాబు పరీక్ష పేపర్స్ 500 రూపాయలు పెట్టి కొన్నారు అని చెప్పడం దుమారం రేపుతోంది. 

1 /5

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎక్కువగా చెన్నైలోనే చదువుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మహేష్ బాబు, రానా, రామ్ చరణ్, మంచు బ్రదర్స్.. ఇలా చాలామంది సినీ ఫ్యామిలీ కిడ్స్ అందరూ తమిళనాడులోనే స్కూల్, కాలేజ్ కూడా పూర్తి చేశారు. అప్పట్లో స్టార్ హీరోల కుటుంబాలు కూడా చెన్నైలోనే స్థిరపడ్డుండటంతో, వారి పిల్లలు అక్కడే చదివారు. అందుకే ఇప్పటికీ చెన్నైలో స్కూల్ రోజులు గుర్తుచేసుకుంటూ ఇంటర్వ్యూలలో హీరోలు చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకుంటుంటారు.

2 /5

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన చదువును చెన్నైలోనే పూర్తి చేశాడు. ఆయన స్కూల్ డేస్‌లో తమిళ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ విష్ణువర్ధన్ క్లోజ్ ఫ్రెండ్స్. అంతేకాక విష్ణువర్ధన్, మహేష్ బాబు బెంచ్ మేట్స్ కూడా అంట. స్కూల్‌లో అల్లరి చేస్తూ, సరదాగా టైం పాస్ చేసేవారు అని స్వయంగా విష్ణువర్ధన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయటపెట్టారు.

3 /5

అదే ఇంటర్వ్యూలో స్కూల్ డేస్‌ గురించి చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఒకసారి ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయనే న్యూస్ వచ్చింది. నేను వెంటనే మహేష్‌కి చెప్పాను. అతను ‘ఎక్కడ దొరుకుతాయి?’ అని అడిగాడు. ఇద్దరం 500 రూపాయలు పెట్టి ప్రశ్నపత్రాలు కొన్నాం. కానీ అవి ఫేక్! దానికన్నా చదివితే బెటర్ అనుకున్నాం” అంటూ నవ్వేశారు విష్ణువర్ధన్. 

4 /5

విష్ణువర్ధన్ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ ‘పంజా’ గుర్తొస్తుంది. ఈ సినిమాతో ఆశించిన రిజల్ట్ రాకపోయినా, పవన్ స్టైలిష్ లుక్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ తర్వాత తెలుగు వైపు చూడని విష్ణువర్ధన్.. ఇప్పుడు మళ్లీ ‘ప్రేమిస్తావా’ సినిమాతో వచ్చారు. ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 30న థియేటర్లలో విడుదలైంది.

5 /5

ఇక మహేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB 29’ సినిమా చేస్తున్నారు. ఇది హాలీవుడ్ స్థాయిలో భారీగా తెరకెక్కనుంది. ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు టాక్. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి!