Balakrishna: బాలకృష్ణతో ఇంకెప్పుడూ నటించనని తేల్చేసిన స్టార్ హీరోయిన్..!

Balakrishna Herione: 90వ దశకంలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన విజయశాంతి, బాలకృష్ణతో కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించారు. కానీ, పెళ్లి తర్వాత ఆయనతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు.  ఇందుకు గల ముఖ్య కారణం తెలిస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే.. పూర్తి వివరాలు లోకి వెళితే..

1 /5

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1980, 90 దశకాల్లో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో నటించి భారీ క్రేజ్ సంపాదించారు. ఆమె పాత్రలు ఎక్కువగా యాక్షన్, లేడీ ఓరియెంటెడ్‌గా ఉండేవి. చిరంజీవితో విజయశాంతి జోడిగా నటించిన ప్రతి సినిమా ఘన విజయం సాధించడంతో, ఈ జోడికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.  

2 /5

అయితే విజయశాంతి బాలకృష్ణతో.. అత్యధిక సినిమాల్లో నటించారు. వీరి కలయికలో దాదాపు 17 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో చాలా చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అప్పట్లో వీరి కెమిస్ట్రీ గురించి సినీ వర్గాల్లో ప్రత్యేకమైన చర్చలు సాగాయి. అంతేకాకుండా, బాలకృష్ణ, విజయశాంతి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని పుకార్లు కూడా వినిపించాయి.  

3 /5

ఒక సమయంలో బాలకృష్ణ, విజయశాంతి పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ, విజయశాంతి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసినా, బాలకృష్ణతో మాత్రం నటించలేదు. దీనిపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి.    

4 /5

విజయశాంతి భర్త పెడిన షరతుల కారణంగానే ఆమె బాలకృష్ణతో సినిమాలు చేయడం మానేశారనే పుకార్లు వినిపించాయి. అంతేకాదు అప్పట్లో ఆమె బాలకృష్ణతో నటించను.. అని చెప్పిందని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే, ఆమె ఇదే విషయాన్ని ఖండించారు. పెళ్లి తర్వాత హీరోలతో తక్కువ సినిమాలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారనే వాస్తవం బయటపడింది. దాంతో, బాలకృష్ణతో నటించకపోవడానికి ఆమె వ్యక్తిగత నిర్ణయమే కారణమని స్పష్టమైంది.  

5 /5

సినిమాలకు దూరమైన విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి, 'రాములమ్మ'గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ జీవితంలో అనేక మలుపులు తీసుకున్న ఆమె బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.   కొంత విరామం తర్వాత విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె పాత్రకు మంచి స్పందన లభించింది.