Ram Pothineni: స్టార్ట్ దర్శకుడితో గొడవ పెట్టుకున్న హీరో రామ్ పోతినేని

Ram Pothineni Fight With Director : హీరో రామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. కెరియర్ స్టార్టింగ్ లోనే మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన ఈ హీరో ప్రస్తుతం మాత్రం కొన్ని ప్రాపులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో అసలు ఫ్లాప్స్ అంటే ఎరగని దర్శకుడు అనిల్ రావిపూడి తో ఈ హీరో గర్వపడ్డారు అన్న విషయం వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 /5

దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి విడుదలైన.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని సాధించారు. ఈ చిత్రం కుటుంబ కథా చిత్రంగా వచ్చి.. ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం రూ. 400 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉందని శనివర్ కాదు భావిస్తున్నారు. అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఆ తర్వాత అనిల్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశముంది. 

2 /5

మరోపక్క హీరో రామ్ పోతినేని ప్రస్తుతం దర్శకుడు మహేష్ తో ఓ ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తోంది. రామ్ గతంలో చేసిన కందిరీగ, మసాలా, పండగ చేస్కో సినిమాలకు అనిల్ రావిపూడి కథ రచయితగా పని చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి అనిల్, రామ్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారంట.  

3 /5

అనిల్ తన తొలి సినిమా పటాస్, తర్వాత సుప్రీమ్ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఆ తర్వాత రాజా ది గ్రేట్ సినిమాకు కథను సిద్ధం చేసుకున్నారు. ఈ కథను రామ్‌కు వినిపించగా, ఆయన కూడా అంగీకరించారు. సినిమా కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే ఆ సమయంలో రామ్ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ కొన్ని సినిమాలు నిరాశపరిచిన నేపథ్యంలో, కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారంట. దీనితో అనిల్ రావిపూడి కూడా ఓకే అని, ప్రాజెక్ట్‌ను వాయిదా వేశారు.  

4 /5

ఆ తర్వాత అనిల్ ఈ కథలో మార్పులు చేసి, రవితేజకు వినిపించగా, ఆయన అంగీకరించారు. వెంటనే ఈ సినిమా ప్రారంభమై, భారీ విజయాన్ని సాధించింది. అయితే రామ్‌తో చేయాల్సిన సినిమా ఎందుకు జరగలేదన్న విషయంపై కొన్ని వార్తలు సినీ వర్గాల్లో వినిపించాయి. రామ్, అనిల్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని..అందుకే ఈ సినిమా వాయిదా పడిందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగింది.  

5 /5

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడిని ఈ విషయంపై ప్రశ్నించగా, రామ్‌తో ముందుగా రవితేజ సినిమా అనుకున్న మాట నిజమే అని.. అయితే కొన్ని కారణాల వల్ల రామ్ బదులు రవితేజని తీసుకున్నారని తెలిపారు. అయితే వారిద్దరి మధ్య గొడవ జరిగిందా లేదా అన్న విషయం పైన మాత్రం.. స్పష్టత ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు రామ్ ఒక మంచి హిట్ సినిమా మిస్ చేసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు.  ప్రస్తుతం రామ్ చేస్తున్న కొత్త సినిమా హిట్ అవుతుందా అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. గతంలో ఆయన చేసిన డబుల్ ఇస్మార్ట్ నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఈసారి రామ్ విజయాన్ని అందుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.