Cholesterol Signs: శరీరంలో అన్నింటికంటే ప్రమాదకరం కొలెస్ట్రాల్. ఎందుకంటే ఒక్క కొలెస్ట్రాల్ సమస్య చాలా వ్యాధులకు కారణమౌతుంది. ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా ప్రాణాంతకం కావచ్చు. చెడు కొలెస్ట్రాల్, చెడు జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోతుంటుంది. దాంతో గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్ ఎటాక్‌కు కారణం కావచ్చు
లక్షణాలు శరీరంలో కన్పించే లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే గుండె వ్యాధులకు దారితీయవచ్చు. సకాలంలో చికిత్స చేయిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ సమస్య నుంచి బయటపడవచ్చు
రక్తం పేరుకోవడం నాలుకపై రక్తం పేరుకోవడం చెడు కొలెస్ట్రాల్ లక్షణం. అంతే కాకుండా నాలుక రంగు డీప్ రెడ్ ఉంటే దానర్థం రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉందని. ఇదంతా కొలెస్ట్రాల్ సంకేతం.
సబ్ లింగ్యువల్ నరాలు లావుగా, వంకరగా, డార్క్ రంగులో ఉండవచ్చు. ఈ లక్షణాలు చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటాన్ని సూచిస్తాయి
నాలుక రంగు నాలుక వంకాయ రంగులో మారితే మీ రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పెద్దఎత్తున ఉందని అర్ధం. ఈ లక్షణాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.