Rice Mask: ఈ హెయిర్‌ మాస్క్‌ వేస్తే జుట్టు వద్దన్నా గడ్డిలా పెరుగుతూనే ఉంటుంది..

Rice Curry Leaves Mask: జుట్టు రాలే సమస్య విపరీతమైన స్ట్రెస్‌ లేదా ఆరోగ్య సమస్యల వల్ల జరుగుతుంది. అయితే, ఇంట్లో ఉండే కరివేపాకు, బియ్యం నీరు రెండిటితో హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేస్తే జుట్టు పట్టి లాగినా ఊడదు. ఈ మాస్క్‌ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం.
 

1 /5

కరివేపాకు, బియ్యం నీరు, మెంతులు ఈ మూడింటితో జుట్టు రాలకుండా దృఢంగా పెరుగుతుంది. అంతేకాదు జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. వద్దన్నా జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.  ముఖ్యంగా ఈ మూడింటి కలయికతో మీ జుట్టుకు మంచి పోషణ కూడా అందుతుంది.  

2 /5

దీనికి ఒక్క చెంచా బియ్యం, ఆవనూనె, కొన్ని కరివేపాకు ఆకులు, మెంతులు తీసుకోవాలి. వీటితో హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకోవాలి. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మన జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి.  

3 /5

నీళ్లు కలిపి ఈ అన్ని పదార్థాలను ఒక బౌల్‌లో కలపాలి. వీటిని మెత్తని పేస్ట్‌ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌కు ఆవనూనె కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. ఇప్పుడు హెయిర్‌ మాస్క్‌ రెడీ అవుతుంది.  

4 /5

ఈ హెయిర్‌ మాస్క్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇందులో మీరు కావాలంటే విటమిన్‌ ఇ క్యాప్స్యూల్‌ కూడా కలుపుకోవచ్చు. ఓ గంట సమయంపాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.  

5 /5

కరివేపాకు, రైస్‌తో కలిపి తయారు చేసిన ఈ మాస్క్‌ వారంలో రెండు సార్లు ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి. కొన్ని నివేధికల ప్రకారం బియ్యం, కరివేపాకు, మెంతులు జుట్టు ఊడకుండా కాపాడతాయి.