Valentines Day: 'మీ ప్రియాతి ప్రియమైన' వారికి ఇలా వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలపండి

Valentines Day 2025 Wishes And Greetings In Telugu: ప్రేమ అనే బంధం అనిర్వచనీయమైనది. అలాంటి ప్రేమకు క్యాలెండర్‌లో ఒక రోజు కేటాయించారు. అదే ఫిబ్రవరి 14వ తేదీ. ప్రతియేటా ఫిబ్రవరి 14వ తేదీని వాలంటైన్స్‌ డేగా.. లవర్స్‌ డేగా పిలుస్తుంటారు. వాలంటైన్స్‌ డే సందర్భంగా మీ ఆత్మీయులు.. మీరు ప్రేమించుకునేవారికి శుభాకాంక్షలు ఇలా తెలపండి.

1 /6

ప్రేమ అనే పదం రెండక్షరాలే. కానీ దాని పరిమాణం కొలవలేనిది. ప్రేమ అనేది రెండు మనసుల మధ్య కలిగే ఒక అందమైన భావన. ప్రేమ అనేది ఆనందాన్ని పంచుతుంది.. కాపాడుతుంది.. ఏడిపిస్తుంటుంది.. జీవితానికి ఊపిరి లూదుతుంది.

2 /6

రెండు మనసుల మధ్య కలిగే అందమైన భావన ప్రేమ. అందమైన జీవితానికి ఊపిరి పోసే ప్రేమను మరింత పదిలం చేసుకునేందుకు ఈ వాలంటైన్స్‌ డేను ఉపయోగించుకుందాం. ప్రియ నీకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.

3 /6

నా జీవితానికి నీ ప్రేమ అనేది ఒక ఊపిరిలాంటిది. నీ ప్రేమ లేని జీవితం నాకు వ్యర్థం. ప్రేమకు చిరునామా అంటే నేను నిన్నే చూపిస్తా. నా జీవితానికి ప్రేమతో జీవం పోస్తున్న నీకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.

4 /6

ప్రేమను చూపించుకోకపోవచ్చు.. సమాజం ముందు నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పుకోలేకపోవచ్చు. కానీ నీకు కష్టమనేది వచ్చిన నాడు నీకు రక్షణగా.. నా మనసుకు గాయమైనప్పుడు మందులా నేను ఉంటా. అసలు నీ మనసుకు గాయం కాకుండా చూసుకోవడమే ఈ ప్రేమికుడి లక్ష్యం. నీకు మరింత ప్రేమను పంచేందుకు ఈ లవర్స్‌ డేను మరింత మధురంగా చేసుకుందాం. నీకు లవర్స్‌ డే శుభాకాంక్షలు.

5 /6

ప్రేమకు ఒక రోజు ఉందని ఈ రోజు ప్రేమికులు సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. కానీ ప్రతి రోజు మనకు ప్రేమికుల రోజే. నీ ప్రేమలో తడిసిపోతూ.. మునిగిపోతున్న నాకు ప్రత్యేకంగా ప్రేమికుల రోజు అవసరమా! 365 రోజుల్లో ఒక రోజయినా ఫిబ్రవరి 14వ తేదీన కూడా నీకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నా.

6 /6

ప్రేమికుల దినోత్సవం అంటూ ఒకటి మనకు అవసరమా? వారం రోజుల పాటు సంబరాలు అవసరమా? ప్రత్యేకంగా లవర్స్‌ డే రోజు నీకు కానుకలు అవసరమా? ఎందుకంటే ప్రతి రోజూ మనకు ప్రేమికుల రోజే! మన ప్రేమ జీవితంలో కాలానికి స్థానమే లేదు! నీ ప్రేమకు నా జీవితాన్నే కానుకగా ఇచ్చిన నీకు మళ్లీ కానుకలు ఎందుకు? మన జీవితంలో మరో అందమైన రోజు అయిన ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.