Asiatic Lion suddenly came from forest in Gujarat: సాధారణంగా అడవికి దగ్గరగా ఉండే గ్రామాల్లో అడవుల నుంచి తరచుగా జంతువులు వస్తుంటాయి. అవి జంతువుల వేటలో, తాగు నీటి కోసం మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. ఇటీవల మనుషులు అడవుల్లో ఎక్కువగా సంచరిస్తున్నారు. అదే విధంగా అడవిని క్రమంగా ఆక్రమించుకుంటున్నారు. దీంతో క్రూర జంతువులు ఇక గ్రామాల మీద పడుతున్నాయని చెప్పుకొవచ్చు. ఇక పోతే ఈ క్రూర జంతువుల బారిన పడి చాలా మంది అమాయకులు తమ ప్రాణాలు సైతం కోల్పోయారు.
ఈ క్రమంలో తాజాగా.. గుజరాత్ లో ఒక భారీ ఆసియా సింహం అడవిలో నుంచి ఏకంగా హైవే మీదకు ఠీవీగా నడుచుకుంటూ వచ్చింది. దీంతో అక్కడున్న వారు సింహాంను తన మొబైల్ ఫోన్ లలో రికార్డు తీశారు. ఈ ఘటన.. గుజరాత్‌లోని భావ్‌నగర్-సోమనాథ్ హైవే మీద చోటు చేసుకుంది.అప్పటి వరకు రోడ్డు మీద వాహనాలు ప్రయాణిస్తున్నాయి. కానీ ఇంతలో ఒక ఆసియా సింహాం రోడ్డు మీదకు వచ్చింది. దీంతో ఎక్కడి ప్రయాణికులు అక్కడే ఆగిపోయారు.
ట్రక్ లు, కార్లు, లారీలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సింహాం గాండిస్తు.. అందర్ని చూస్తూ.. కాసేపు రోడ్డు మీద అటు ఇటు తిరిగింది. అరగంట సేపు ఎవరు కూడా కదలకుండా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సింహాంను చూస్తు ఉండిపోయారు.
కాసేపయ్యాక.. సింహాంతిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను అక్కడున్న వారు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్.. ఎంత డేంజర్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అక్కడున్న వాళ్లకు ఎంత భయం వేసి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు.