Elephant attacks on jcb shocking video: సాధారణంగా అడవికి దగ్గరగా ఉండే గ్రామాలలో తరచుగా క్రూర జంతువులు వస్తుంటాయి. పులులు, ఏనుగులు, చిరుతలు, ఎలుగు బంట్లు వస్తుంటాయి. ఇవి ఆహారం కోసం, తాగు నీటి కోసం గ్రామాల్లోకి వస్తుంటాయి. కొన్ని సార్లు మనుషులపై దాడులు చేసి చంపేస్తుంటాయి. అయితే.. ముఖ్యంగా ఏనుగులు మనుషులపై దాడులు చేస్తుంటాయి. అవి గుంపులుగా సంచరిస్తు పంటపొలాలను ధ్వంసం చేస్తుంటాయి.
ఈ క్రమంలో ఏనుగులు మొదటగా తమ తొండంతో, గట్టిగా ఘీంకరిస్తు అవతలి వారిని దూరంగా వెళ్లమన్నట్లు హెచ్చరిస్తుంటాయి. అవి పట్టించుకొకుండా.. ఏనుగుల దగ్గరకు వెళ్తే మాత్రం.. అవి దాడులు చేసి ప్రాణాలను సైతం తీసేస్తుంటాయి. ఏనుగులు కొన్నిసార్లు తమ గుంపు నుంచి విడిపోతుంటాయి. అంతేకాకుండా.. మదం ఎక్కి కోపంతో సంచిరిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వాటికి దగ్గరగా ఏది కన్పించిన దానిపై దాడులు చేస్తుంటాయి.
Poor Elephant (Location: Unknown) pic.twitter.com/WjfhxHDa9F
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 3, 2025
ప్రస్తుతం ఒక ఏనుగు ఏకంగా జేసీబీపైన తన ప్రతాపం చూపించింది. ఈవీడియో వార్తలలో నిలిచింది. కొంతమంది రైతులు పొలంలో జేసీబీతో పొలం పనులు చేసుకుంటున్నారు. అప్పుడు అడవిలో నుంచి ఒక భారీ ఏనుగు బైటకు వచ్చింది. అంతే కాకుండా.. అది గట్టిగా అరుస్తు జేసీబీపైన దాడికి దిగింది. జేసీబీని దూరంగా నెట్టివేస్తు హల్ చల్ చేసింది. దీంతో అక్కడున్న రైతులు భయంతో పరుగులు పెట్టారు.
ఆ తర్వాత ఏనుగు జేసీబీనీ వదిలేసింది. అక్కడి వాళ్లు గట్టిగా అరుస్తు, శబ్దాలు చేస్తు ఏనుగును అడవిలొకి వెళ్లేలా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు వామ్మో.. జేసీబీనీ ఎత్తిపడేస్తుందిగా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter