Today's Viral News: ఆర్డర్‌ చేసిన నాలుగేళ్లకు డెలివరీ.. షాక్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి!

Today's Viral News: ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువు నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ అనుభవం ఎదురైంది. ఈ సంఘటన గురించి ఆ వ్యక్తి ఈ కింది విధంగా పేర్కొన్నాడు. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2023, 08:33 PM IST
Today's Viral News: ఆర్డర్‌ చేసిన నాలుగేళ్లకు డెలివరీ.. షాక్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి!

Today's Viral News: ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే అది మీ ఇంటికి చేరుతుంది. మరీ దూరమైతే వారం లేదా రెండు వారాల్లో వచ్చేస్తుంది. కానీ ఇక్కడో వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన నాలుగు సంవత్సరాల తర్వాత డెలివరీ అయింది. ఈ విషయాన్ని ఆయన తాజాగా ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. 

ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నితిన్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. కోవిడ్‌కు ముందు చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఆలీ ఎక్స్‌ప్రెస్ నుండి ఓ వస్తువును ఆర్డర్ చేశారు. నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆ వస్తువును డెలివరీ చేసింది సదరు సంస్థ. దీంతో షాక్ కు గురైన నితిన్.. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ‘ఆశ కోల్పోవద్దు.. ఏదో ఒక రోజు మీ వస్తువులు డెలివరీ చేయబడతాయి’ అని క్యాప్షన్ కూడా రాశాడు. 

Also Read: Most Wanted Monkey: జనాన్ని గడగడలాడించి చుక్కలు చూపించిన మోస్ట్ వాంటెడ్ కోతి అరెస్ట్

జాతీయ భద్రత దృష్ట్యా 2020లో భారత ప్రభుత్వం ఆలీ ఎక్స్‌ప్రెస్‌ను నిషేధించింది. దీన్ని  బ్యాన్ చేయకముందు వస్తువును కొనుగోలు చేసినట్లు అగర్వాల్‌ తెలిపారు. ఏ వస్తువును కొనుగోలు చేశాడనే విషయం వెల్లడించలేదు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. ఆ వస్తువును నిషేధించకముందే కొన్నానని అగర్వాల్ తెలిపారు. కొనుగోలు చేసిన వస్తువు ఏదీ వెల్లడించలేదు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. “డిసెంబర్ 2019లో, నేను రెండు వస్తువుల కోసం ఆర్డర్ చేసాను. మీ పోస్ట్ చూసిన తర్వాత.. ఎప్పటికైనా వస్తాయని నమ్మకం ఏర్పడింది అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. ‘మీరు చాలా అదృష్టవంతులు సార్. నేను 2017-19లో చాలా ఆర్డర్ చేశాను. వాటి బిల్లులన్నీ ఉన్నాయి. వాటి కోసం వెయిటింగ్' అని మరో యూజర్ ట్వీట్ చేశాడు.

Also Read: Monster of King Cobra: ఇట్స్ నాట్ ఎ కింగ్ కోబ్రా.. ఇట్స్ ఎ కింగ్ ఆఫ్ మాన్‌స్టార్‌.. వీడియో చూస్తే గుండె ఆగటం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News