Bride Groom funny video : గుర్రం ఎక్కుదామంటే పబ్లిక్‌లో పెళ్లికొడుకు ప్యాంట్ చిరిగింది..

Bride groom pant torn in wedding : కరెక్ట్‌గా పెళ్లికొడుకు గుర్రం ఎక్కే ముందే ప్యాంట్ చిరిగింది (pant chirigindhi). మరి ఆ క్షణంలో అతడు ఏం చేశాడు.. ఎలా రియాక్ట్ అయ్యాడో ఈ వీడియోలో ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 07:48 PM IST
  • గుర్రం ఎక్కి ఊరేగింపులో పాల్గొందామంటే.. పబ్లిక్‌లో చిరిగిన పెళ్లికొడుకు ప్యాంట్
  • అసలు విషయం తెలియయక గుర్రం ఎక్కు అంటూ తొందరపెట్టిన బంధుమిత్రులు
  • పాపం పెళ్లి కొడుకు పరిస్థితి అంటూ.. సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్
 Bride Groom funny video : గుర్రం ఎక్కుదామంటే పబ్లిక్‌లో పెళ్లికొడుకు ప్యాంట్ చిరిగింది..

Groom funny video bride groom pant torn before sitting on the horse in wedding : పెళ్లిళలో సాధారణంగా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఒక్కోసారి కొందరు ఎంత ప్లాన్‌గా పెళ్లి వేడుక జరుపుకుంటున్నా కూడా ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. కొందరు వధూవరులు (bride and groom) తమ పెళ్లికి ముందే ఫుల్ ప్రిపేర్ అయి ఉంటారు. పెళ్లికి ఎలాంటి డ్రెస్‌ (Dress) వేసుకోవాలి.. ఫోటో షూట్‌కు ఎలాంటి దుస్తులు ధరించాలి..బయటకు వెళ్లే ప్రోగ్రామ్స్‌కు, ఊరేగింపులో ఎలాంటి డ్రెస్‌ వేసుకోవాలి అని ముందే డిసైడ్ అయి ఉంటారు. దాని ప్రకారం దుస్తులన్నీ డివైడ్ చేసుకుని పెట్టుకుని ఉంటారు. 

కొన్నిసార్లు ఇలా ఫుల్ ప్రిపరేషన్‌తో వధూవరులు ఉన్నా కూడా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే ఒక పెళ్లి కొడుకు కూడా ఇలానే మొత్తానికి సూట్ బూట్ వేసుకుని టీక్‌టాక్‌మని రెడీ అయ్యాడు. ఛలో ఇక గుర్రం (Horse) ఎక్కి ఊరేగింపులో పాల్గొందామని బయల్దేరాడు. అయితే చివరి క్షణంలో వరుడి ప్యాంట్‌ (Groom pants‌) పట్టుమని చిరిగిపోయింది. (pant chirigindhi) మరి ఆ క్షణంలో అతడు ఏం చేశాడు.. ఎలా రియాక్ట్ అయ్యాడో ఈ వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో (Social media) ఇప్పుడు ఈ వీడియో వైరల్ (Viral video) అవుతోంది. కరెక్ట్‌గా పెళ్లికొడుకు గుర్రం ఎక్కే ముందే ప్యాంట్ (Pant) చిరిగిపోయింది.

వివాహ వేడుక ఊరేగింపు బయలుదేరడానికి కొన్ని సెకన్ల ముందు ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. చుట్టుముట్టూ మొత్తం బంధువులు, పబ్లిక్ ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు ప్యాంట్ చిరిగిపోవడంతో (pant torn) అతని ఏం చెయ్యాలో తోచలేదు. పక్కనున్న వాళ్లేమో.. అసలు విషయం తెలియయక.. ఓ అన్నా గుర్రం (Horse) ఎక్కు ఊరేగింపు మొదలుపెడదామని తొందర పెడుతూ ఉంటారు.

పాపం అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి చూడాలి.. ఏం చెయ్యాలో అర్థంకాక అటుఇటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. పక్కన ఎవరైనా ఇంట్లో వాళ్లు ఉంటే వారికి చెబుదామంటే ఎవరూ ఉండరు. ఇలా అయితే కాదులే అనుకుంటాడు. గట్టిగా కేకలు వేసి చెప్తాడు..నా ప్యాంట్ చిరిగిపోయింది.. మరో ప్యాంట్ తీసుకురండి అంటూ గట్టిగా తన కుటుంబ సభ్యులకు చెప్తాడు పెళ్లి కొడుకు. ఇక తనను గుర్రం ఎక్కు అని తొందర పెట్టే వారికి.. అన్నా ప్యాంట్ చిరిగిపోయింది అని వారికి అర్థమయ్యేలా గట్టిగా చెప్పేస్తాడు. తర్వాత నా రూమ్‌లో బట్టలు ఉంటాయి తీసుకురండి అని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు వరుడు. 

 

Also Read : సామిసామి పాటకు అదిరే స్టెప్పులేసి చహల్ సతీమణి.. రష్మికను మించిపోయిందిగా! (వీడియో)

ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఘంటా అనే హ్యాండిల్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. పాపం.. పెళ్లి కొడుకు ప్యాంట్ (Pellikoduku pant) చిరిగిపోయి బాధపడుతుంటే పక్కనున్న వారు గుర్రం ఎక్కు అని తొందరపెడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

Also Read : Omicron Scare: తెలంగాణలో మళ్లీ కఠిన ఆంక్షలు- న్యూ ఇయర్ వేడుకలు బంద్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News