22 Feet Huge King Cobra Viral Video: పాములు ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలిసిందే.. అయితే భూమి మీద రెండు జాతుల పాములు కలిగి ఉన్నాయి.. ఈ జాతుల్లో కొన్ని విషపూరితమైతే.. మరికొన్ని సాధారణమైనవి. ప్రస్తుతం భూమి మీద విషపూరితమైన పాములే అధికంగా ఉంటాయి. పాములు చాలా వరకు అటవీ ప్రాంతంలో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. వాతావరణంలో కాలుష్యం ఏర్పడడం కారణంగా అడవులు తగ్గిపోవడం వల్ల ఆహారం కోసం జనసంచారంలోకి వస్తున్నాయి.
చాలావరకు జనసంచారాల్లోకి వచ్చిన పాములను స్నేక్ క్యాచర్స్ తమ వంతు సహాయంగా పాములను పట్టుకొని సురక్షిత ప్రదేశాల్లో వదిలిపెడుతున్నారు. ఈ పట్టుకునే క్రమంలో వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలే తెగ ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇటీవలే ఓ స్నేక్ క్యాచర్ పామును పట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇక వీడియో విషయానికొస్తే.. ఓ భారీ కింగ్ కోబ్రా జనసంచారాల్లోకి ప్రవేశిస్తుంది. అయితే దీనిని గమనించిన స్థానికులు ప్రముఖ స్నేక్ క్యాచర్ జయ కుమార్ సమాచారం అందించగా ఆయన అక్కడికి చేరుకుంటాడు. పాము సంచరించిన ప్రదేశాన్ని జయకుమార్ బృందం కోబ్రా కోసం గాలిస్తుంది. ఇలా వెతుకుతున్న క్రమంలో ఎండిన కట్టెల్లో ఆ భారీ కింగ్ కోబ్రా సంచారం చేయడం చూసి స్నేక్ క్యాచర్ తోకతో బయటికి లాగేందుకు ప్రయత్నిస్తాడు. ఇలా ప్రయత్నించే క్రమంలో జయ కుమార్ చేతిలో నుంచి పాము తప్పించుకుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి