Maha kumbh mela digital snan video viral: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ప్రతిరోజు కూడా కోట్లాది మంది భక్తులు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళ కావడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఫిబ్రవరి 26న చివరి షాహి స్నానం కావడంతో యూపీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ఈ క్రమంలో ఎలాగైన కుంభమేళకు వెళ్లాలని భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు.
ఇప్పటికే దాదాపుగా.. 56 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఫిబ్రవరి 26 వరకు ఈ సంఖ్య మరింత పెరగొచ్చని కూడా తెలుస్తొంది. అయితే కుంభమేళకు వెళ్లే భక్తుల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. తాజాగా..కుంభమేళకు వెళ్లలేని వారికోసం.. ఒక వ్యక్తి కాస్తంత వెరైటీగా ఆలోచించాడు.
దేశ్ భక్త్ ఆకాశ్ బెనర్జీ అనే యూట్యూబర్.. కుంభమేళకు వెళ్లలేని వారి కోసం తాను డిజిటల్ పుణ్యస్నానాలు చేయిస్తానని కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంతే కాకుండా.. తన వాట్సాప్ నంబర్ కు ఫోటోలు పెడితే.. కుంభమేళ నీటిలో ముంచి వారికి కుంభమేళకు రాకున్న... ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానం ఆచరించిన పుణ్యం కలిగేలా చేస్తానని కూడా వీడియో రిలీజ్ చేశాడు. ఎవరైన కుంభమేళలో స్నానం చేయాలని అనుకుంటారో.. వారి పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను వాట్సాప్ చేస్తే.. దాన్ని ఇతను ప్రింట్ తీసుకుని.. నీళ్లలోకి తీసుకెళ్లి 11 సార్లు పుణ్యస్నానం చేయిస్తాడంట. దీని కోసం అతను 1.100 చార్జీలను వసూలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మరీ ఇంత మోసమా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు దేవుడి పేరు మీద మోసం చేయడానికి మీరు మనుషులేనా.. అంటూ ఫైర్ అవుతున్నారు. భక్తులు మనోభావాలు, నమ్మకాలపై బిజినెస్ ఏంటని కూడా కొందరు ఫైర్ అవుతున్నారు.