Man set fire to Gas cylinder to control cold weather video: సోషల్ మీడియాలో ప్రతిరోజు వందలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వెరైటీగా ఉన్న వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. కొంత మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు, వైరల్ అయ్యేందుకు పిచ్చి చేష్టలు చేస్తుంటారు.
తమ పిచ్చీ పీక్స్ అన్న విధంగా ప్రవర్తిస్తుంటారు. కొంతరు రీల్స్ పిచ్చిలో పడి అసలు ఏంచేస్తున్నారో అన్నది కూడా మర్చిపోయి తమ ప్రాణాలను రిస్క్ లో పడేసుకుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం అనేక చోట్ల ఉదయం పూట చలిగా ఉంటుంది. మరికొన్ని రోజుల్లో చలిపూర్తిగా తగ్గిపోతుంది.
చాలా మంది చలి నుంచి బైటపడేందుకు ఉదయం పూట రోడ్లపక్కన లేదా ఇంటికి బైట కర్రలు పెట్టుకుని, కాగితాలు, కొబ్బరి బూరు వేసుకుని మంట పెట్టి.. చలి కాపుకుంటారు. మరికొందరు బెడ్ షీట్ లు, కంబళ్లను వేసుకుంటారు. కానీ ఇక్కడోక వ్యక్తి మాత్రం వెరైటీగా ప్రవర్తించాడు.
Read more: Viral Video: కుంభమేళాకు వచ్చి ఒక జంట పాడుపని.. ఆగ్రహాంతో నాగ సాధు ఏంచేశారంటే.. వీడియో వైరల్..
ఏకంగా సిలీండర్ బుడ్డీని బైటకు తీసుకొచ్చి దానికే మంట పెట్టాడు. ఆ మంటతో చలికాచుకుంటున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసి న నెటిజన్ లు షాక్ అవుతున్నారు. మరికొందరు ఏందీ భయ్యా.. వీడు ఇంత వయలెంట్ గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.