Indore girl dies while dancing in wedding: పెళ్లి వేడుకల్లో జరిగిన సంగీత్ కార్యక్రమంలో ఇటీవల మధ్య ప్రదేశ్ లోని విదిశలో యువతి చనిపోయింది. ఈ ఘటనకు చెందిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్లు చాలా మంది ఎమోషనల్ కు గురయ్యారు. ఘనంగా పెళ్లి వేడుకలు, అతిథులు, స్నేహితులు మధ్య ఉల్లాసంగా డాన్స్ చేస్తుండగా.. ఇలాంటి ఘటన జరగం అక్కడికి వచ్చిన అతిథులు, ఆ కుటుంబంలో కన్నీళ్లను నింపింది.
A young woman suddenly d!ed while dancing on stage at her sister's wedding in Vidisha MP
pic.twitter.com/6e1dqgevka— Ghar Ke Kalesh (@gharkekalesh) February 9, 2025
ఈ క్రమంలో ఘటనలో డాన్స్ చేస్తు ఇండోర్ కు చెందిన పరిణీతి జైన్ అనే యువతి ప్రాణాలు విడిచింది. తన కజిన్ సిస్టర్ పెళ్లికి వెళ్లిన పరిణితీ డాన్స్ చేస్తు విగత జీవిగా మారిపోయింది. యువతి డాన్స్ చేస్తు ఒక్కసారిగా కుప్పకూలీ పడిపోయింది. ఈ ఘటన తర్వాత యువతిని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.
అప్పటికే ఆమె హర్ట్ స్ట్రోక్ తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే.. గతంలో పరిణితీ సోదరుడు కూడా గుండెపోటుతోనే చనిపోయినట్లు అక్కడి వాళ్లు వెల్లడించారు.
అప్పుడు కొడుకు, ఇప్పుడు కూతురు హర్ట్ ఎటాక్ తో చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం అని చెప్పుకొవచ్చు. యువతి ఇటీవల ఎంబీఏ పూర్తి చేసింది. ఆమెకు సంబంధాలు సైతం చూస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన జరగడం బాధకరమని బంధులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటన ప్రస్తుతం అందరిని కలిచి వేస్తుందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter