Watch the King of Monster Cobra Video: భూమి మీద ఎన్నో రకాల పాము జాతులు ఉన్నాయి. ఈ జాతుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఈ పాములు చాలా విషపూరితమైనవి.. ఇవి వాటి విషాన్ని ఇతర జంతువులు లేదా మనుషుల శరీరంలోకి వదిలితే ప్రాణాంతకంగా మారవచ్చు. అంతేకాకుండా ఇవి ఎంతో దూరంలో ఉన్న జంతువులను సులభంగా పసికట్టగలవు. అయితే ఈ కింగ్ కోబ్రాల కంటే ఇంకా తెలివైన పాములు కూడా ఉన్నాయి.. అవే మాన్‌స్టార్ కింగ్ కోబ్రా. ఇవి సాధారణ కింగ్ కోబ్రాల కంటే అతి ప్రమాదకరమైనవి. చూడడానికి నల్లగా 11 నుంచి 12 అడుగుల దాకా పొడవైన శరీరాన్ని కలిగి ఉంటాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. స్నేక్ క్యాచర్లు ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పాములు అంటే ఆసక్తి గలవారు ఎక్కువగా ఈ వీడియోలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇటీవలే మాన్ స్టార్ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ స్నేక్ క్యాచర్ పామును పట్టుకున్న వీడియోను నెట్టింట్లో షేర్ చేశాడు.
Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
వీడియో విషయానికొస్తే.. ఓ యువ స్నేక్ క్యాచర్ రైతు అందించిన సమాచారం మేరకు పాము సంచరించిన ప్రదేశానికి వెళ్తాడు. ఇలా పంట పొలం దగ్గరికి చేరుకొని 20 నిమిషాల పాటు పామును వెతికేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు పాము ఆ పంట పొలం నుంచి దారి గుండా బయటికి వెళ్లడం గుర్తించి ఆ స్నేక్ క్యాచర్ భారీ మాన్స్టర్ కింగ్ కోబ్రా పాము తోకను పట్టుకొని లాగే ప్రయత్నం చేస్తాడు. ఇంతలోనే ఆ పాము గమనించి స్నేక్ క్యాచర్ను కాటేసే ప్రయత్నం చేస్తుంది. ఆ కాటు నుంచి స్నేక్ క్యాచర్ త్రుటిలో తప్పించుకుంటాడు.
ఇలా తప్పించుకున్న స్నేక్ క్యాచర్ మరోసారి ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈసారి కూడా పాము కాటేసే ప్రయత్నం చేస్తుంది.. ఇలా పది నిమిషాల దాకా పాముని పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. చివరికి పాము అలసిపోయి ఆయనకు దొరికిపోతుంది. ఈ వీడియోను SAHABAT ALAM అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను 90 వేల మందికి పైగా వీక్షించారు.
Also Read: Viral News: స్నేక్స్ కంటే 100 రేట్లు విషం ఉన్న జంతువు ఇదే.. అది తలుచుకుంటే క్షణాల్లో చావు ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి