సెల్ఫీ పిచ్చితో ఓ వ్యక్తి దాదాపు 50 అడుగుల ఎత్తైన సెల్ టవర్ ఎక్కేశాడు. అయితే ఒక్కడే ఎక్కలేదు. ఎలాగోలా తన సైకిల్ కూడా టవర్ పైకి ఎక్కించేశాడు. అలా సైకిల్‌తో సెల్ టవర్ ఎక్కాక.. అదే టవర్ పై సైకిల్ తొక్కుతున్నట్లు సెల్ఫీ తీసుకున్నాడు. అయితే ఎలాగైతే సైకిల్‌ను టవర్ ఎక్కించాడో.. అదే విధంగా దానిని క్రిందకు తీసుకురాలేకపోయాడు.
టవర్‌లో సైకిల్ ఇరుక్కుపోవడంతో దానిని అక్కడే అలాగే వదిలేసి.. క్రిందకి దిగి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే స్థానికులు సెల్ టవర్ పై సైకిల్ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు సీసీటీవి ఫుటేజీల ద్వారా ఆ వ్యక్తిని కనిపెట్టారు. టవర్ పైకి సైకిల్ ఎక్కించిన వ్యక్తిని మధ్యప్రదేశ్‌కి చెందిన రోహిత్ సగర్వాల్గా గుర్తించారు.
సెల్ఫీ పిచ్చి బాగా ముదిరి.. ఆఖరికి సెల్ఫీల్లోనే వివిధ ప్రయోగాలు చేద్దామని నిర్ణయించుకొని సైకిల్ని సెల్ టవర్ ఎక్కించానని రోహిత్ చెప్పడంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. ఆ కుర్రాడి సెల్ఫీ పిచ్చిని తగ్గించడం కోసం ప్రస్తుతం అతన్ని కౌన్సిలింగ్ సెంటర్‌కు పంపించారు పోలీసులు.