Viral Video: ముంబైలో కళ్ల ముందే కూలిన భవనం..స్థానికుల పరుగులు..వీడియో వైరల్..!

Viral Video: మహారాష్ట్రలో ఓ ఘటన తెగ వైరల్‌ అవుతోంది. ప్రాణ భయంతో స్థానికులు పరుగులు తీశారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 19, 2022, 04:35 PM IST
  • ముంబైలో కూలిన భవనం
  • కొనసాగుతున్న సహాయకచర్యలు
  • సాయిబాబా నగర్‌లో ఘటన
Viral Video: ముంబైలో కళ్ల ముందే కూలిన భవనం..స్థానికుల పరుగులు..వీడియో వైరల్..!

Viral Video: మహారాష్ట్రలోని ముంబైలో ఓ భవనం కుప్పకూలింది. పశ్చిమ బొరివలిలోని సాయిబాబా నగర్‌లో నాలుగంతస్తుల భవనం కళ్ల ముందే ఒక్కసారిగా కూలిపోయింది. భవనం కూలుతున్న సమయంలో శబ్ధాలు భారీగా రావడంతో స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. శిథిలమైన భవనం కావడంతోనే కుప్పకూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ముందస్తుగానే అక్కడున్న వారిని అధికారులు ఖాళీ చేయించారని తెలుస్తోంది. 

శిథిలావస్థకు చేరిన భవనం ఒక్కసారిగా కూలడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్, రెస్క్యూ సిబ్బంది..సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భవనం శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. పరిసరాలను ముమ్మరంగా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఘటనాస్థలిలో 8 అగ్నిమాపక దళాలు, రెండు రెస్క్యూ వాహనాలు, మూడు అంబులెన్స్‌లు ఉన్నాయి.

భవనం కూలుతున్న దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో బంధించి..సోషల్ మీడియా మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో నెటిజన్లు వీడియోను షేర్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. పాత భవనాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముంబైలో పాత భవనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడైనా పాత భవనాలు ఉండే..చుట్టూ పరిసర ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.

Also read:China: చైనాలో సెగలు పుట్టిస్తోన్న హీట్ వేవ్..మేఘమథనం షూరు చేసిన ప్రభుత్వం..!

Also read:IND vs ZIM: మరో సిరీస్‌పై కన్నేసిన టీమిండియా..రేపే జింబాబ్వేతో రెండో వన్డే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News