Man praying god before stealing hundi: ఆలయంలో హుండీ చోరీ, ఆలయంలో నగలు చోరీ.. ఈ తరహా వార్తలు మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఇలాంటి చోరీలు జరిగినప్పుడు.. దొంగకు దేవుడంటే భయం లేనట్టుంది. అందుకే దేవాలయంలోనే దేవుడిని దోచుకున్నాడని అంటుంటారు. కానీ ఇదిగో ఈ వైరల్ వీడియో (Viral video) చూడండి.. గుడిలో చోరీ చేయడానికి వెళ్లిన దొంగ ఏం చేశాడో చూస్తే.. మీ ఉద్దేశాలు మారిపోవచ్చు.
హుండిని దొంగిలించడానికని వెళ్లి దేవాలయంలో చొరబడ్డాడు. హుండీని ఎత్తుకెళ్లే ముందు జేబులోంచి సెల్‌ఫోన్ తీసి ఆలయంలోపల ఫోటోలు తీశాడు. హుండీని టచ్ చేసే ముందు దేవుడు ఏమంటాడో ఏమో అనే భయం అడ్డమొచ్చినట్టుంది కాబోలు.. ఎంతైనా మంచిదనే ఉద్దేశంతో దేవుడికి దండం పెట్టుకుని హుండీని చేతపట్టుకుని (Thief stealing hundi in temple) అక్కడి నుంచి ఎవరో వెంటపడినట్టు పరుగు అందుకున్నాడు. చెప్పడం ఎందుకు కానీ.. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే వివరాలు తెలుసుకునే ముందు మీరే ఆ వీడియో చూడండి.
Bizzare! Man seeks blessings before stealing donation box from Hanuman temple in Maharashtra’s Thane
Read More: https://t.co/AAhxxJCS1M#Maharashtra #thane #viralvideo pic.twitter.com/fnIZqxiaSE
— Zee News English (@ZeeNewsEnglish) November 13, 2021
Also read : Children's Day 2021: బాలల దినోత్సవం నవంబర్ 14కి ఎలా మారిందో తెలుసా ?
మహారాష్ట్రలోని థానె జిల్లా ఖోపట్ ప్రాంతంలో ఉన్న హనుమాన్ మందిరంలో (Theft in Hanuman Temple) నవంబర్ 9న రాత్రి వేళలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయం పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. నాలుగు రోజుల తర్వాత శనివారం నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. చోరీ జరిగినప్పుడు హుండీలో ఉన్న రూ. 1000 అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు నౌపర పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (stealing hundi caught on camera) అవుతోంది.
Also read : Scorpion Farming on Terrace : ఇంటి టెర్రస్‌పై తేళ్లలాంటి క్రాఫిష్ సాగు.. దున్నేస్తేన్న యువతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook