Remedy For Success Ful Work: నార్మల్ గా ప్రస్తుతం ఒకరు,మరోకరి గురించి అస్సలు ఆలోచించట్లేదు. అంత టైమ్ కూడా ఉండట్లేదు. ప్రతిరోజు ఉరుకుగు, పరుగులతో జీవనం సాగిస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచిరాత్రి పడుకునే దాక.. తమ ఉద్యోగాలలో ఎంతో బిజిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. కొందరు ఇంట్లో నుంచి ఏదైన అనుకొని వెళ్లగానే పనులైపోతాయి. అదే మరికొందరు ఎంత గింజుకున్నపనులు అస్సలు కావు. ఒకపనికోసం పదిసార్లు తిరగాల్సి వస్తుంది. అది కూడా జరుగుతుందన్న నమ్మకం మాత్రం లేదు. ఆఫీసు పనులు, కోర్టుల పనులు, వ్యక్తిగత సమస్యలు వంటివి అనేకం ఉంటాయి.
Read More: Momos Recipe: యమ్మీ యమ్మీ మోమోస్ .. తయారు చేసుకోండి ఇలా
ఒకసారి వెళ్లాక పనులు కాకుంటే ఎంతో చిరాకుగా ఉంటుంది. దీని ప్రభావం ఇదర విషయాలపై కూడా ఉంటుంది. అందుకే జ్యోతిష్యులు దీని కోసం కొన్ని ఉపయాలను సూచించారు. పనులు మీద వెళ్లేటప్పుడు ఇవి పాటిస్తే, వెంటనే పనులైపోతాయి. తిరిగి చూస్కొవాల్సిన అవసరం అస్సలు ఉండదు.. ముఖ్యంగా ఏదైన పనిమీద వెళ్లేటప్పుడు నోటిలో కాస్తంతా బెల్లం లేదా చక్కెరను వేసుకొవాలి. ఇవి నోటిని తీయ్యగా మారుస్తుంది. అంటే మీరువెళ్లినచోట వాక్కు స్పష్టంగా వస్తుంది.
మనం ఎదుటి వారితో మాట్లాడే దాన్ని బట్టి, మన పనులు అవుతుంటాయి. పెద్దలు నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుందంటారు. అందుకే ఎవరితోనైన మాట్లాడేటప్పుడు కటువుగా, మనస్సు నోచ్చుకునే విధంగా అస్సలు మాట్లాడకూడదు. బైటకు వెళ్లేటప్పుడు ఇంట్లో వాళ్లు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగకూడదు.
Read More: Pragya Jaiswal: హాట్ హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్, లేటెస్ట్ పిక్స్ వైరల్
ఒకసారి పనిమీద ఇంట్లో నుంచి కాలు బైటకు పెట్టామంటే మరల ఇంటికి రాకూడదు. కొద్ది దూరం వెళ్లి మరల తిరిగి రావడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే వెళ్లిన పనులు అస్సలు కావని చెబుతుంటారు. అదే విధంగా అనాదీగా కూడా చక్కెర, బెల్లం ను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఇవి నోట్లో వేసుకుని వెళ్తే ఏ కార్యమైన నిర్విఘ్నంగా అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook