Lucky Zodiac Signs: ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఎవరి జీవితమైనా సుఖ సంతోషాలతో సాగుతుంది. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పూజలు చేస్తారు, మరికొందరు పరిహారాలు, యాగాలు చేస్తారు. అయితే ఇవేవీ చేయకపోయినా రాశిచక్రంలోని 5 రాశుల వారిపై ఆ లక్ష్మీ కృప ఎప్పుడూ ఉంటుంది. ఆ 5 రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభం : వృషభరాశి వారి పట్ల లక్ష్మి దేవి కృప ఎప్పుడూ ఉంటుంది. ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. సిరి సంపదలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారిలో కష్టపడి పనిచేసే తత్వం ఉంటుది. స్వతహాగా చాలా తెలివైనవారు. అదృష్టవంతులు కూడా. తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల వారికి డబ్బుకు లోటు ఉండదు.
మిథునం : మిథున రాశి వారు చాలా అదృష్టవంతులు. మా లక్ష్మి అనుగ్రహం వలన వారు చాలా సంపదలను పొందుతారు. జీవితంలో విజయం మరియు గౌరవం పొందండి. ఈ వ్యక్తులు కూడా కష్టపడి పనిచేసేవారు మరియు వారి స్వభావం కూడా సంతోషంగా ఉంటుంది, కాబట్టి ప్రజలు వారితో ఉండటానికి ఇష్టపడతారు.
సింహం: సింహ రాశి వారు పుట్టుకతో అదృష్టవంతులు. ఈ వ్యక్తులకు డబ్బుకు ఎప్పుడూ కొదువ ఉండదు. జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు ఉండవు. వారు సంతోషంగా ఉంటూనే ఇతరులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు.
తుల: తులారాశి వ్యక్తులు తమ వ్యక్తిత్వం ద్వారా గౌరవ మర్యాదలు పొందుతారు. ఎదుటివారిని సులువుగా ఆకట్టుకోగలరు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ఖరీదైన వస్తువులను ఇష్టపడతారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో జీవితంలో అపారమైన సంపద, సకల సౌఖ్యాలను పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
మీనం: మీన రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకు లోటు ఉండదు. కృషిని నమ్ముకుని విజయాలు సాధిస్తారు. మీన రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. కలలు నెరవేర్చుకునేందుకు తగిన కృషి చేస్తారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీనిని నిర్ధారించలేదు.)
Also Read: Telangana Politics: తెలంగాణలోనూ త్వరలో మహారాష్ట్ర సీన్? ఇక్కడి ఏకనాథ్ షిండే ఆయననేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook