Friday Remedies: వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిసేందుకు ప్రతి వ్యక్తి ప్రయత్నాలు చేస్తాడు. వైవాహిక జీవితం సరిగా ఉండేందుకు బాధ్యతగా ఉంటాడు. మరింత సంతోషంగా గడిపేందుకు శుక్రవారం నాడు కొన్ని పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.
వైవాహిక జీవితం సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వైవాహిక జీవితంలో కలహాలుంటే మనశ్సాంతి లేకుండా ఉంటుంది. దాంతోపాటు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి సాధించలేరు. ఈ పరిస్థితుల్లో వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసేందుకు కొన్ని పద్ధతులున్నాయంటున్నారు జ్యోతిష్య పండితులు.
భార్యభర్తల మధ్య పెరుగుతున్న అంతరం..బంధాన్ని నెమ్మది నెమ్మదిగా అంతం చేస్తుంది. దీని వెనుక గ్రహాల అశుభ ప్రభావం కారణంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జ్యోతిష్యశాస్త్రంలో శుక్రవారం నాడు కొన్ని పద్ధతుల గురించి సూచించబడింది. ఈ పద్ధతుల్ని అనుసరించడం ద్వారా వైవాహిక జీవితాన్ని తిరిగి ఆనందమయం చేసుకోవచ్చు. ఆ సూచనలేంటో తెలుసుకుందాం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతుంటాయో..అక్కడ లక్ష్మీదేవి నిలవదు. ఈ పరిస్థితుల్లో వైవాహిక జీవితాన్ని సుఖమయం చేసుకునేందుకు శుక్రవారం నాడు నెయ్యి దానం చేయాలి. దాంతోపాటు లక్ష్మీదేవి ఆలయంలో విధి విధానాలతో పూజలు చేస్తే..సుఖశాంతులుంటాయి. అటు ఇంటికి దిష్టి తగిలినా సరే..బంధాల్లో అంతరం, బేధాలు ఏర్పడతాయి. దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఒక మట్టి దీపంలో రెండు కర్పూరం గోళీలు వేయాలి. ఆ తరువాత ఈ దీపాన్ని ఇంట్లో అంతా తిప్పాలి. దీనివల్ల దాంపత్య జీవితంలో మాధుర్యం పెరిగింది. ఇంటి నెగెటివిటీ పెరుగుతుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వైవాహిక జీవితంలో మాధుర్యం ఉండాలంటే శుక్ర గ్రహాన్ని బలంగా ఉంచాల్సిన అవసరముంది. ఆ రోజు 108 సార్లు గ్రామ్ గ్రీమ్ గ్రూమ్ సహ శుక్రాయ నమహ మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు బలమౌతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook