Mercury Planet Gochar In Capricorn 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తాయి. దీని వల్ల కాలానుగుణంగా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. మెర్క్యురీ గ్రహం ఫిబ్రవరి 7న మకరరాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా అరుదైన భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రబావం అన్ని రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తెలివితేటలు, కమ్యూనికేషన్ కు కారకుడైన బుధుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
మకర రాశిచక్రం (Capricorn)
ఈ రాశిలోనే భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరాశి యెుక్క లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో ఈ యోగం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కారణంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు డబ్బును ఆదా చేస్తారు. ఈసమయంలో పెట్టుబడి పెట్టడం వల్లల మీరు ప్రయోజనం పొందుతారు. వివాహం కానీ వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
వృషభ రాశి (Taurus)
భద్ర రాజయోగం ఏర్పడటం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తుంది. అందుకే ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు.
కన్య రాశిచక్రం (Virgo)
భద్ర రాజయోగం ఏర్పడటం మీకు ఆహ్లాదకరంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ సంచార జాతకంలో ఐదవ ఇంట్లో సంచరిస్తుంది. అందుకే ఈ సమయంలో మీరు పని-వ్యాపారాలలో మంచి విజయాన్ని పొందవచ్చు. దీంతో పాటు ఆదాయం కూడా పెరగవచ్చు. అదే సమయంలో, కొత్త ఆదాయ మార్గాలను సృష్టించవచ్చు.దీంతో పాటు ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో మేలు చేస్తుంది. మీరు ఎక్కడి నుండైనా కొత్త ఉద్యోగం కోసం ప్రతిపాదనను పొందవచ్చు. అలాగే, మీరు రిలేషన్ షిప్ లో ఉన్నట్లయితే, మీ లవ్ పార్టనర్ తో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.
Also Read: Vish Yoga: శని, చంద్రుల కలయిక వల్ల అరుదైన యోగం.. ఈ రాశులవారి లైఫ్ నరకప్రాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook