Gem Stone For Success: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు వ్యక్తి యొక్క జీవిత పురోగతికి అడ్డంకులు సృష్టిస్తాయి. మీరు కూడా మీ కెరీర్లో విజయం సాధించాలని కోరుకుంటారు. అయితే ఎంత కష్టపడినప్పటికీ, తగిన ప్రతిఫలం లభించదు. అటువంటి పరిస్థితుల్లో రత్నాలు ధరించమని రత్న శాస్త్రం (Gemology) సలహా ఇస్తుంది. తద్వారా మీ కెరీర్ దూసుకుపోతుంది.
ఇంజనీరింగ్‌లో విజయం సాధించడానికి..
సివిల్ ఇంజినీరింగ్ రంగాన్ని శనీశ్వరుడు శాసిస్తున్నాడని జ్యోతిష్యం చెబుతోంది. మీరు ఈ రంగంలో ఉంటే ఖచ్చితంగా శనితో సంబంధం ఉన్న రత్నమైన నీలమణిని ధరించాలి. నీలమణి రత్నాన్ని ధరించడం ద్వారా, ఒక వ్యక్తి కోరుకున్న విజయాన్ని పొందుతారు. దానిని ధరించే ముందు ఒక్కసారి జ్యోతిష్యుడిని సంప్రదించండి.
కంప్యూటర్ టెక్నాలజీ కోసం..
రత్న శాస్త్రం ప్రకారం, కంప్యూటర్ టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగంలో పేరు పొందాలనుకునే వ్యక్తులు ఒనిక్స్ రత్నాన్ని ధరించవచ్చు. మీరు జ్యోతిష్య నిపుణుడు సహాయంతో సరైన పద్ధతిలో ధరిస్తే, మీరు కోరుకున్న పురోగతిని పొందుతారు.
కళలు, మీడియా రంగానికి..
నటన, గానం, రంగస్థలం, మోడలింగ్, మీడియా మొదలైన రంగాలలో విజయం సాధించాలనుకునే వారు బుధ, శుక్రుడుకు సంబంధించిన పచ్చని వజ్రాన్ని ధరించడం మంచిది. ఈ రత్నాల ఉపరత్నాలను జ్యోతిష్య సలహాతో కూడా ధరించవచ్చు.
వైద్య రంగానికి..
వైద్య రంగంలో ముందుకు సాగే వ్యక్తుల కోసం సూర్యుడితో పాటు అంగారక, శుక్ర మరియు చంద్ర గ్రహాలకు సంబంధించిన రత్నాలను ధరించాలని సూచించబడింది. వైద్య రంగంలో విజయం సాధించడానికి ముత్యాలు, రూబీ మరియు డైమండ్ రత్నాలను కూడా ధరించవచ్చు.
Also Read: ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. మీ ఇంట్లో డబ్బే డబ్బు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook