Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 03, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Horoscope In Telugu 03 May 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 03వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2021, 08:08 AM IST
Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 03, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 03 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 03వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఇటీవలి ప్రాజెక్ట్ కోసం చేసిన పనితో కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి జంటలు కొత్త ఇంటి కోసం వెతుకుతారు. విద్యార్థులు వారి చదువుపై దృష్టి పెట్టాలని మరియు తరువాత ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. పనులు సజావుగా పూర్తవుతాయి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు పొందుతారు.

Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos 

వృషభ రాశి
ఈ రోజు మీరు కొంచెం నీరసంగా కనిపిస్తారు. కనుక మీరు ప్రశాంతంగా మరియు ఏ పనుల జోలికి వెళ్లకూడదని కుటుంబసభ్యులు సూచిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ఈరోజు కొంత సమయం ధ్యానం చేయండి. మీకు అప్పగించిన కొత్త పని వల్ల పని కొద్దిగా గందరగోళంగా ఉండవచ్చు. స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టడం లాభాలు అందిస్తాయి. అనుకోకుండా కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు పనిపై ఫోకస్ చేయాలి. 

మిథున రాశి
మీరు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని చూస్తారు. మరియు మీ కుటుంబంలో ఒకరితో మరొకరు చక్కగా కలిసిపోతారు. ఈ రోజు మీరు చేసే పని కొంచెం ఒత్తిడికి గురిచేస్తుంది. ఆఫీసులో జరిగే పనిలో మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.

కర్కాటక రాశి 
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారులు ఈ రోజును ప్రారంభిస్తారు. మీ మానసిక ఆరోగ్యంపై దృష్టిసారించాలి. ఈరోజు ఏకాంతంగా ఉండి ప్రస్తుత పరిస్థితులపై ఆలోచిస్తారు. కుటుంబంతో కొంత సమయం గడపటం ద్వారా మీ మనసు తేలిక అవుతుంది. కొన్ని శుభవార్తలు అందుతాయి. కెరీర్ అభివృద్ధి కోసం శాయశక్తుల ప్రయత్నిస్తారు. 

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

సింహ రాశి
మీకు అప్పగించిన పనులను పూర్తి చేయడానికి తొందరపాటు చర్యలు తగవు. నిదానంగా, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలి. మీ సహోద్యోగుల నుండి సహాయం తీసుకోండి. విద్యార్థులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక సమస్యలు తీరతాయి. నేడు ఉద్యోగావకాశాలు గోచరిస్తున్నాయి.  

కన్య రాశి
కుటుంబ సభ్యులు అప్పగించిన పనులు చేయడంతో ఒత్తిడికి లోనవుతారు. నేడు మీ పిల్లల ఆరోగ్యం ఒక సమస్య కావచ్చు. చిన్నారులను ఇంటి నుంచి బయటకు పంపరాదు. ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకోవాలని యత్నిస్తారు. మీకు తెలిసిన ఓ వ్యక్తి సాయం తీసుకుంటే అనున్నది జరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటారు. 

తులా రాశి
ఈరోజు తులా రాశి వారు పనులు కాస్త వేగంగా చేయాల్సి వస్తుంది. సాధారణ రోజుల కన్నా అధిక శక్తిని వినియోగిస్తారు. నేడు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తారు. మీ ఆర్థిక విషయాలను తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. మీ పెట్టుబడికి అదనపు నగదు ఇంట్లో ఉందా లేదా అని తనిఖీ చేస్తారు. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశం నిరుద్యోగులకు సంతోషాన్నిస్తుంది. 

వృశ్చిక రాశి
అనవసర ఖర్చులు ఆర్థిక సమస్యలకు కారణం అవుతాయి. కనుక అవసరం ఉంటేనే నగదు ఖర్చు చేయాలని భావిస్తారు. ఈ రోజు విద్యార్థులు చదువుకు దూరం అవుతారు. ప్రేమ లాంటి వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. వ్యాపారులు స్థిరాస్తుల కొనుగోలు కోసం పెట్టుబడి పెడతారు.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

ధనుస్సు రాశి
ఇంట్లో తలెత్తే సమస్యలు మీ ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇది మీకు చాలా లాభాలను తెస్తుంది. పిల్లల చదువు గురించి ఇంట్లో చర్చ జరగవచ్చు. యువతీయువకుల వివాహం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని పనులు మధ్యలోనే వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఎలాంటి సహకారం లభించదు.

మకర రాశి
ఉద్యోగులకు పరిస్థితి అనుకూలంగా మారుతుంది. పనిచేసే చోట యజమానులు ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఈ రోజు ఇంట్లో ఉండి పని చేయడం మంచిదని భావిస్తారు. 
ఈ రోజు కొన్ని ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యులతో సరదాగా కాస్త సమయాన్ని గడుపుతారు. దీని వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. 

కుంభ రాశి
నేడు మీరు అధికంగా శ్రమించక తప్పదు. ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, అది అమలు చేయడానికి ఇది మంచి రోజు. గతంలో చేసిన పెట్టుబడులపై లాభ సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనులలో అవాంతరాలు, కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

మీన రాశి
ఖర్చులు తగ్గించుకోవడంపై ఫోకస్ చేస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. కొంతమంది సహోద్యోగులు లేకపోవడంతో పని ఒత్తిడి, బాధ్యతలు రెట్టింపు కానున్నాయి. వ్యక్తిగత జీవితానికి సైతం సమయం కేటాయించాలని నిర్ణయించుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News