Horoscope Today 19 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 19వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి రోజు. ఇదివరకే శిక్షణ పొంది పని చేస్తున్నా, పనిచేసే చోట మీకు మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంటుంది. ఇతరులు చెప్పే మంచి విషయాలు వినాలి. మానసిక ప్రశాంత కోల్పోతారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం రాదు.
Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos
వృషభ రాశి
నేడు మీరు మీ కోసం సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తారు. అందులో ఉండే సంతోషాన్ని తెలుసుకుంటారు. స్నేహితులు, సన్నిహితులతో కలిసి బయటకు వెళ్లాలని భావిస్తారు. కానీ ప్రస్తుతం అందుకు అనుకూల పరిస్థితులు లేవని గుర్తిస్తారు. మీరు ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేస్తుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
మిథున రాశి
మిథున రాశివారు ఈరోజు ఎక్కువగా తినాలి, ఎక్కువగా తాగాలి అని ఆలోచిస్తుంటారు. కానీ అనారోగ్యానికి కారణమయ్యే వాటి జోలికి వెళ్లడానికి ఇది తగిన సమయం కాదు. దానికి బదులగా శారీరక శ్రమ కోసం వ్యాయామం చేయండి. అవసరమైతే కొంత విశ్రాంతి తీసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. బయటకు వెళ్లి స్నేహితులకు కలుసుకోవాలనే ఆలోచనను మానుకోవాలి.
కర్కాటక రాశి
గత కొంతకాలం నుంచి మీరు ఓ కష్టతరమైన పనిని వాయిదా వేస్తూ వస్తున్నారు. దానిపై అనుమానాలు దూరం చేసుకుని, ఆ పనిని సరైన మార్గంలో పూర్తి చేసేందుకు తగిన సమయం ఇది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. చేతికి డబ్బు అందుతుంది. ప్రాధాన్యత ప్రకారం పనులు పూర్తి చేసుకోవాలి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
సింహ రాశి
ఈరోజు సింహ రాశివారు కొన్ని కష్టాలు ఎదుర్కోనున్నారు. కష్టపడి పనిచేసినా కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. సన్నిహితులతో వివాదాలు మిమ్మల్ని బాధిస్తాయి. మీ బంధువులకు కొన్ని పనులు పూర్తి చేయడంలో సాయం చేస్తారు. అయితే మీ గురించి, మీ కుటుంబం గురించి కూడా ఆలోచించండి. ఆఫీసు పనులకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, కుటుంబానికి సైతం సమయం కేటాయించాలని మరువొద్దు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
కన్య రాశి
కష్టంగా భావించే పనులను పూర్తి చేయడానికి మీరు గతానికి భిన్నమైన ధోరణితో వ్యవహరిస్తారు. మానసిక ప్రశాంతతతో పనులు పూర్తిచేసి ఇతరులను ఆశ్చర్యపరుస్తారు. మీ జీవిత భాగస్వామితో సమస్య ఉంటే, చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. సరదాగా మాట్లాడుతూ ఉంటే మీ గొడవలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. నూతన పరిచయాలు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.
తులా రాశి
ఈరోజు తులా రాశివారు పనులతో తీరిక లేకుండా గడుపుతారు. అయితే అందరికీ పనులు చేయడం ముఖ్యమే. కానీ అదే లోకంగా ఉండకూడదని గ్రహిస్తారు. కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తే వారు సంతోషంగా ఉంటారు. గతంలో చేసిన పెట్టుబడులకు ఫలితం దక్కనుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలు అందుతాయి.
వృశ్చిక రాశి
ఇంట్లో జరిగే కొన్ని విషయాలలో మీరు సర్దుబాటుకు సిద్ధంగా లేరు. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యకు దారితీయనుంది. ప్రమాణాలను పక్కనపెట్టి, కుటుంబ సభ్యుల సంతోషం గురించి ఆలోచించండి. అదనపు బాధ్యతలతో కొంతమేర ఆందోళనకు గురవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి.
ధనుస్సు రాశి
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఒకేచోట కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. కనుక కచ్చితంగా శారీరక శ్రమ చేయాలి. ఉదయం లేదా సాయంత్రం వేళ కొన్ని వ్యాయామాలు, అవసరమైతే యోగా చేయడం మీకు ఫలితాన్నిస్తుంది. నేడు వాహనాల ద్వారా సమస్యలలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభించదు.
Also Read: Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే
మకర రాశి
ఈరోజు మీకు ఓపిక నశించినట్లు అనిపిస్తుంది. శారీరక శ్రమ ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఒకేచోట కూర్చుని ఉంటే మీరు ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. మీకు ఇష్టమైన పనులను చేస్తూ మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి యత్నించండి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న నగదు చేతికి అందుతుంది. కొన్ని కీలక విషయాలు చెవిన పడతాయి. నేడు మీకు లాభసాటిగా ఉండనుంది.
కుంభ రాశి
ఈరోజు మీకు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. నేడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తారు. ఎలాంటి అనుమానం, ఆందోళన లేకుండా కుటుంబసభ్యులతో చర్చించి అడుగు ముందుకు వేయనున్నారు. గతంలో చేపట్టిన పనులు సైతం కొన్ని పూర్తవుతాయి.
కొందరు స్నేహితులను మిమ్మల్ని కలుసుకుని ముచ్చటిస్తారు. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.
మీన రాశి
చేపట్టిన పనులలో ఆటంకాలు తలెత్తుతాయి. కానీ మీరు మనసులో దీనిని అనుభూతి చెందుతారు. ప్రయాణాలు చేయడానికి సిద్ధపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేనందున కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. పనిలో మీకు సహాయం చేసిన వారికి క్రెడిట్ ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉండనుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన పెట్టుబడులకు వ్యాపారులు శ్రీకారం చుడతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook