Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 21, 2021 Rasi Phalalu, ఓ రాశి వారికి ధనలాభం

Horoscope Today 21 February 2021: ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2021, 10:00 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 21, 2021 Rasi Phalalu, ఓ రాశి వారికి ధనలాభం

Horoscope Today 21 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 21న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
నేడు మీపై చంద్రుడి ప్రభావం ఉంటుంది. దాని కారణంగా కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొన్ని విషయాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరమైన సమస్యలతో పనులు నత్తనడకన సాగుతాయి. దగ్గరి వారి నుంచి హాని జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దైవచింతన పెరుగుతుంది.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

వృషభ రాశి
సమాజంలో అందరితో కలిసేందుకు తగిన సమయం ఇది. ఒకవేళ మీరు ఇతరులను కలవడానికి ఇష్టపడకపోతే, ఇంట్లోనే ఒంటరిగా గడపండి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథున రాశి
మీ ఆలోచనల్ని నియంత్రించుకోవాలి. అత్యాశకు వెళితే మీకు ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు. వ్యాపారులు, ఉద్యోగులకు మేలు జరుగుంది. గత కొంతకాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్య తీరనుంది. మీకోసం కొంత సమయాన్ని కేటాయించి పరిస్థితిని అర్థం చేసుకుంటారు. స్నేహితుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. 

కర్కాటక రాశి
ఈ రోజు మీకు అప్పగించిన పని మీరు చేసేదానికన్నా మించినదిగా అనిపించవచ్చు. అయితే మొదటి అడుగు వేసిన తర్వాత మిగతావన్నీ చాలా సులభంగా పూర్తి చేస్తారు. మీ నైపుణ్యమే మీకు శ్రీరామరక్ష. అయితే మీరు కోరుకున్న దారిలో కాకుండా వేరే దారిలో పయనించాల్సి వస్తుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాల కొనుగోలు ద్వారా ప్రయాణాలు చేసే సూచనలు గోచరిస్తున్నాయి.

సింహ రాశి
సింహ రాశి వారు ఈరోజు దిగజారినట్లుగా భావిస్తారు. అయితే మిమ్మల్మి మీరు నమ్మి ముందుకు సాగడంతో మంచి ఫలితాలు రానున్నాయి. కుటుంబంలో పరిస్థితులు చికాకు తెప్పిస్తాయి. ధనవ్యయం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు కోరుకున్న విధంగా పనులు జరగవని గుర్తి్స్తారు. అయితే దీనికి సమయం పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే సమయం ఇది.

Also Read: Art of living: రవిశంకర్‌‌కు అమెరికా వర్శిటీ అరుదైన గౌరవం

కన్య రాశి
ఈ రోజు ఇతరులు మీ నుంచి గమనించే విషయంతో ప్రేరణ పొందుతారు. మీ పనిని ఇతరులు మెచ్చుకుంటారు. మీ సలహాల కోసం ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు. నేడు మీకు ధన లాభం. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కనుక ఏదైనా చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. విద్యార్థులకు మేలు జరుగుతుంది.

తులా రాశి
మీలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. దీని కారణంగా చుట్టుపక్కల వారు మిమ్మల్ని చిన్నచూపు చూస్తారు, కొందరైతే ఏకంగా భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు.
మిమ్మల్ని మీరు మరింత నమ్మాలి. అందుకోసం యోగా, ధ్యానం లాంటివి మార్గాలు. ఉద్యోగులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సైతం కలిసొస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు. దైవచింతన పెరిగి ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చిక రాశి
మీకు ఆసక్తి ఉన్న రంగంలోకి అడుగుపెట్టాలి.  కోరుకున్నదాన్ని ఆస్వాదించండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. మీ వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ వహించడం ద్వారా మేలు జరుగుతుంది. 

ధనస్సు రాశి
మీ కష్టాలకు తగిన ప్రతిఫలం దక్కనుంది. ఉద్యోగులు నూతన బాధ్యతలు అప్పగిస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు తగిన సమయం ఇది. ఈ స్థాయికి చేరుకోవడానికి మీరు చాలా కష్టపడ్డారు. ఆర్థిక పరిస్థితి మెరగవుతుంది. బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కళారంగం వారికి అవకాశాలు లభిస్తాయి. 

మకర రాశి
ఈ రోజు మీ చుట్టూ జరుగుతున్న విషయాలు మిమ్మల్ని నిరుత్సాహానికి గురిచేస్తాయి. అయితే వీటి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోరాదు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సమయమని భావిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని విషయాలలో సర్దుకుపోవడం మంచిది.

Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు

కుంభ రాశి
నిర్దిష్ట పరిస్థితిలో ఎవరితోనైనా పోటీ పడుతున్నట్లు తెలుసుకుంటారు. మీరు అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడంలో కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. వాహనయోగం ఉంది. శత్రువులకు మీ గురించి తెలిసి మార్పు మొదలవుతుంది.

మీన రాశి
ముందుకు సాగడానికి మరియు ప్రారంభించడానికి ఇది తగిన సమయం. పాత విషయాలను మరువకపోతే మీకు మానసిక ప్రశాంతత లభించదు. మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థి మెరుగ్గా ఉన్నా కొన్ని విషయాలు చికాకు తెప్పిస్తాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News