Horoscope Today July 5th: నేటి రాశి ఫలాలు.. ఆ రంగాల్లోని వ్యాపారులకు ఇవాళ ధన లాభం...

Horoscope Today July 5th 2022: ఇవాళ కొన్ని రాశుల వ్యాపారులకు విశేషంగా కలిసొస్తుంది. ధన లాభం ఉంటుంది. యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగానికి అవకాశం ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 06:45 AM IST
  • కొన్నిరాశుల వ్యాపారులకు ఇవాళ లాభాలు
  • యవత ఉద్యోగాన్వేషణ ముగుస్తుంది.. కొత్త అవకాశాలు వస్తాయి..
  • ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today July 5th: నేటి రాశి ఫలాలు.. ఆ రంగాల్లోని వ్యాపారులకు ఇవాళ ధన లాభం...

Horoscope Today July 5th 2022: ఇవాళ  మంగళవారం (జూలై 5). మిథునరాశి వారు కుటుంబంలో పిల్లల విజయాలకు మురిసిపోతారు. కొన్ని రాశులకు చెందిన ఆయా రంగాల్లోని వ్యాపారులకు ఇవాళ విశేషంగా కలిసొస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు, ఉద్యోగావకాశాలు వస్తాయి. ఇవాళ రాశిచక్రంలోని 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 

మేష రాశి (Aries)

ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. తద్వారా మీ ఉద్యోగ స్థితి మెరుగుపడుతుంది. బంగారం, వెండి వ్యాపారులకు ఇవాళ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు యూత్‌కి చాలా సరదాగా గడుస్తుంది. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్లే అవకాశం ఉంది. ఎప్పుడు, ఎవరితో మాట్లాడినా.. ఆలోచనాత్మకంగా మాట్లాడండి. ఎప్పుడూ పెద్దలను అవమానించకండి. ప్రస్తుతం వానలు కురుస్తున్నందునా..జలుబు లాంటి సమస్యలు వేధించవచ్చు. వాతావరణం మారినప్పుడు అందుకు తగినట్లుగా జీవనశైలిలో మార్పులు అవసరం. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. 

వృషభ రాశి (Taurus)

ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇది వారి ఆర్థిక స్థితిని మరింత మెరుగురుపరుస్తుంది. యవతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రవాణా వ్యాపారం చేసే వారు నష్టాలు చవిచూసే పరిస్థితి రావొచ్చు. ఇవాళ విద్యార్థులకు అనుకూలమైన రోజు. జ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో సంధ్యా ఆరతి తప్పక చేయాలని గుర్తుంచుకోండి. ఇప్పటికీ ఇలా చేయనట్లైతే.. ఇవాళ్టి నుంచే ప్రారంభించండి. తద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. షుగర్ నియంత్రణలో ఉంటుంది. వైద్యుడి సూచన మేరకే మందులు వాడాలి.

మిథున రాశి (GEMINI)

ప్రభుత్వ రంగాల నుంచి అనుకోని లాభాలు పొందుతారు. విద్యారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపార విషయాలలో రిస్క్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ రిస్క్ చేయదలుచుకుంటే.. అది సాహసోపోతమైన నిర్ణయమనే చెప్పాలి. యువతకు మంచి సహవాసం మాత్రమే ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబంలో పిల్లల విజయాలను చూసి మురిసిపోతారు. ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్వీయ చికిత్స ఎట్టిపరిస్థితుల్లో మంచిది కాదు.

కర్కాటక రాశి (Cancer) 

ఇవాళ అధికారిక పనులతోనే గడుస్తుంది. బిజీ బిజీగా తిరగాల్సి వస్తుంది.ఆదాయ స్థితి కొంత మెరుగుపడుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. కలప వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. యువత స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొన్నిసార్లు స్నేహితులతో కలిసి వాకింగ్‌కి వెళ్తారు. రిలేషన్ షిప్స్‌కి తగిన సమయం కేటాయించాలి. అప్పుడప్పుడు బంధువులతో మాట్లాడాలి.

సింహ రాశి (LEO)

ముఖ్యమైన పనుల్లో తొందరపాటుగా వ్యవహరిస్తారు. గందరగోళానికి గురవుతారు. స్వచ్చంద సంస్థల్లో పనిచేసేవారికి అనుకూల సమయం. దీన్ని సద్వినియోగం చేసుకుని మరింత యాక్టివ్‌గా పనిచేయాలి. విద్యార్థుల ఫోకస్ తమ లక్ష్యం వైపే ఉండాలి. ఇతరుల పనుల్లో తలదూర్చకూడదు. ఇవాళ పుట్టినరోజు జరుపుకునే వ్యక్తులు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి. తెల్లవారుజామున నిద్రలేచి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి. ఇంటి పెద్ద అందరి గురించి ఆలోచిస్తాడు కానీ తన గురించి పట్టించుకునే తీరిక ఉండదు.

కన్య రాశి (Virgo)

ఇవాళ మీకు కర్మ పూజ.  ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వ్యాపారంలో అనుభవం కలిసొస్తుంది. అనుభవం లేకుండా వ్యాపార రంగంలో దిగవద్దు. పాత తప్పులను పునరావృతం చేయకుండా చేసుకోండి. యవనస్థులు తల్లిదండ్రుల మాటలు వినాలి. లేకపోతే నష్టపోతారు. విద్యార్థులు చదువుకు మరింత సమయం కేటాయించాలి. పిల్లల చదువుల విషయంలో ఖర్చులు పెరుగుాయి. దీని కారణంగా కొంత మానసిక ఒత్తిడి ఉండొచ్చు.

తులా రాశి (Libra)

కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి పని వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. అనుభవం లేని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవద్దు. రాబోయే కాంపిటీటీవ్ పరీక్షలకు ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి. ప్లానింగ్ ఉంటే విజయం సాధిస్తారు. లేకపోతే నష్టపోతారు. చాలా కాలం తర్వాత జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పోషకాహారం మాత్రమే తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి.

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళ చాలా పనులు చుట్టుముడుతాయి. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేసే వ్యాపారులకు ఇవాళ కొంత నష్టం ఉండొచ్చు. క్లాసులో టీచర్లు తిడితే విద్యార్థులు చిన్నబోవద్దు. టీచర్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. బోధించిన పాఠాన్ని మనసు పెట్టి చదవండి. ఎవరి పట్ల కోపం ప్రదర్శించవద్దు. కుటుంబ విషయాల్లో అందరి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకోండి.

ధనుస్సు రాశి (Sagittarius)  

విదేశాల్లో ఉద్యోగాన్వేషణలో ఉన్నట్లయితే మీకు విజయం దక్కుతుంది. కాబట్టి ఉద్యోగాన్వేషణను మరింత ముమ్మరం చేయండి. ఫైనాన్స్‌ వ్యాపారులు లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనుకూల రోజు. యువత ఆలోచనలు, పనులు మరింత చురుగ్గా ఉంటాయి. త్వరగా లక్ష్యం చేరుకోవాలంటే పనిలో వేగం అవసరం. కుటుంబ సభ్యులతో గడపండి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలంటూ ఉండొద్దు.

మకర రాశి (Capricorn) 

అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. మీరు టీమ్‌ను లీడ్ చేసే వ్యక్తులైతే ఉద్యోగుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. వ్యాపార రంగంలో ఉన్నవారు మరింత చురుగ్గా పనిచేస్తారు. తెలియని వ్యక్తులు ఏదో చెప్పారని.. అనుభవం లేని రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించి నష్టపోవద్దు. యువత తమ లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది.

కుంభ రాశి (Aquarius)

వ్యక్తిగత రహస్యాలు బయటివారితో పంచుకోవద్దు. ఉద్యోగంలో ఉన్నవారు సంస్థ పట్ల విధేయతను చాటుకుంటారు. మెడికల్ వ్యాపారంలో ఉన్నవారికి ఇవాళ లాభాలు ఉంటాయి. కస్టమర్లు పెరుగుతారు. విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యకు ప్రయత్నాలు చేస్తారు. తల్లి ఆరోగ్యం క్షీణించినట్లయితే వైద్యుడిని సంప్రదించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. లేనిపక్షంలో గాయపడే ప్రమాదం ఉంది. 

మీన రాశి (Pisces) 

కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. గాయనీ, గాయకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. గౌరవప్రదమైన వేదికపై తమ ప్రతిభను చాటుకునే ఛాన్స్ వస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కబుర్లు చెబుతూ కాలక్షేం చేస్తారు. వ్యాపారంలో అకస్మాత్తుగా ఖర్చులుపెరుగుతాయి. ఆరోగ్యపరంగా పొట్టకు సంబంధించిన సమస్యలు రావొచ్చు. ఆపదలో ఉన్నవారు మీ దరిచేరితే సాయం చేయండి.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Hotel Service Charge: సామాన్యులకు గుడ్‌న్యూస్‌..ఇకపై సర్వీస్ ఛార్జీలు ఉండవు..!

Also Read: God Father: మెగా అభిమానులకు ఇక పునకాలే.. గాడ్‌ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News