Horoscope Today July 6th 2022: ఇవాళ బుధవారం (జూలై 6). గణేశుడిని పూజించడం ద్వారా ఇవాళ సత్ఫలితాలు పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ గ్రహాల గమని రాశిచక్రంలోని 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి (Aries)
ఇవాళ అనుకున్న పని పూర్తి చేయగలుగుతారు. ఇందుకోసం పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తారు. హోటల్ రెస్టారెంట్ల వ్యాపారులు నాణ్యత విషయంలో రాజీ పడవద్దు. నాణ్యత బాగుంటే కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నాణ్యత పడిపోతే.. కస్టమర్స్ సంఖ్య పడిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువత లక్ష్యానికి చాలా దగ్గరగా వెళ్తారు. అయితే లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి కెరీర్లో పురోగతి ఉండొచ్చు. బీపీ పేషెంట్లు వైద్యుడిని సంప్రదించి.. వైద్య సలహా మేరకు మందులు వాడండి. గురువును భక్తితో పూజించండి. తద్వారా సకల కార్యాలు నెరవేరుతాయి.
వృషభ రాశి (Taurus)
సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఇవాళ అనుకూలిస్తుంది. వ్యాపారస్తులు చిన్న పెట్టుబడులతోనే పెద్ద లాభాలను ఆర్జించవచ్చు.భారీ పెట్టుబడులకు దూరంగా ఉండటమే బెటర్. యువత.. వారు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులు కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకోసం లోతైన అధ్యయనం చేయాలి. ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్య పరంగా సమస్యలు పెరగవచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
మిథున రాశి (GEMINI)
ఆఫీసులో సహోద్యోగులతో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. బాస్ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని మీ పనిపై ఫోకస్ చేయండి. హార్డ్‌వేర్ వ్యాపారులకు ఇవాళ ధన లాభం ఉంటుంది. యువత, విద్యార్థులు ఇవాళ చురుకుగా ఉండాలి. కుటుంబంలో పొదుపు, ఖర్చుని బ్యాలెన్స్ చేసుకోవాలి. లేనిపక్షంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారు.ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సమతుల్య పోషకాహారంతో పాటు యోగా, ప్రాణాయామం చేయండి. ప్రతికూలతలు మిమ్మల్ని వెంటాడివచ్చు.
కర్కాటక రాశి (Cancer)
సేల్స్, మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులకు అనుకూలమైన రోజు. సులువుగా టార్గెట్ పూర్తి చేస్తారు. వ్యాపారవేత్తలు ఇతరులతో పోటీ పడాలి. డెయిరీ వ్యాపారులకు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తాయి. సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్న యువత అనుకున్నది సాధిస్తారు.కుటుంబ పరిస్థితులు కొంత ఆందోళన కలిగిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు చుట్టుముడుతాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం సడలనివ్వొద్దు.
సింహ రాశి (LEO)
ఈ రాశిరికి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సంస్థ నుంచి మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. పబ్లిక్ డీల్స్ చేసే వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప నిర్లక్ష్యం సమస్యగా మారవచ్చు. యువత ఎవరితోనూ అనవసరపు మాటలు మాట్లాడకూడదు. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మందులు అయిపోతే వెంటనే తెచ్చిపెట్టండి.
కన్య రాశి (Virgo)
ఉద్యోగాన్వేషణ ముగుస్తుంది. తీపి కబురు అందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు పన్ను నిబంధనలను పాటించనందుకు ఆర్థిక జరిమానాలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. యువతకు మొరటుతనం, చిరాకు మంచిది కాదు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే భార్యాభర్తలు కలిసి సరిదిద్దుకోండి. జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లి సమయం గడపండి.
తులా రాశి (Libra)
ఉద్యోగ బదిలీ అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ జరగొచ్చు. బడా వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పూవులు, పర్ఫ్యూమ్స్, కాస్మోటిక్స్ వ్యాపారం చేసే వారు లాభపడతారు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్న యువత మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది, ఇంటికి అతిథుల రాక ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio)
సహోద్యోగులతో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు తప్పులు దొర్లకుండా తెలివిగా పని చేయాలి. స్టేషనరీ వ్యాపారం చేసే వారు నిరాశ చెందుతారు. ఇతర వ్యాపారాల్లో మందగమనం ఉంటుంది. విద్యార్థులు అర్థం కాని సబ్జెక్టులను అర్థం చేసుకునేందుకు మరింత కష్టపడుతారు. కుటుంబమంతా ఒకచోట కూర్చొని భోజనం చేసే సంప్రదాయాన్ని ఏర్పరచుకోండి. ఇది ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు రావొచ్చు. ప్రస్తుత ఉద్యోగంలో అసంతృప్తి వెంటాడుతుంది. వ్యాపార రంగంలో మార్పు కోరుకునేవారు మరికొంత సమయం వేచి ఉండాలి. ప్రస్తుతం అందుకు అనుకూలంగా లేదు. మిలటరీలో చేరాలనుకునే యువతకు సత్ఫలితాలు ఉంటాయి. అనవసర చర్చలు, వివాదాలు చేదు అనుభవాన్ని మిగల్చవచ్చు. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమం.
మకర రాశి (Capricorn)
విద్యా రంగంలో పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. స్కూల్స్ నిర్వహించేవారికి అన్నివిధాలా అనుకూల సమయం. వ్యాపారవేత్తలతో సంబంధాలు పెరుగుతాయి. కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. యువత తమ అంతరాత్మ ప్రకారం ముందుకు సాగితే సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం క్షీణించే పరిస్థితి తలెత్తవచ్చు. ఇది చాలా ఆందోళనకు గురిచేస్తుంది.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వ్యక్తులు సానుకూల ఆలోచనలతో లక్ష్యం దిశగా నడవాలి. అప్పుడే విజయం వరిస్తుంది. వ్యాపారవేత్తలు వ్యాపార విస్తరణపై దృష్టి సారించవచ్చు. పెట్టుబడుల విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాలి. పోటీ పరీక్షలు రాసే యువత ఢీలా పడవద్దు. ధైర్యంగా పరీక్షలు రాయాలి. ఇంట్లో చిన్న పిల్లల ఆరోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మీన రాశి (Pisces)
అనవసరమైన ఆందోళన కలవరపాటుకి గురిచేస్తుంది. విద్యార్థులు చదువు పట్ల మరింత శ్రద్ధ పెట్టాలి. యువత కుటుంబం పట్ల బాధ్యతారాహిత్యంగా ఉండవద్దు. ఎవరికీ బాధ కలిగించవద్దు. బీపీ పేషెంట్లు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారం సాఫీగా సాగుతుంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: YSRCP Plenary 2022: వైఎస్సార్సీపీ ప్లీనరి 2022 కమిటీలకు వీళ్లే పెద్దలు
Also Read: Dussehra 2022: ఈ ఏడాది దసరా ఎప్పుడు, విజయ దశమి మహత్యం, తేదీ, ముహూర్తం ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook